Vijay Devarakonda: సుకుమార్ డైరెక్షన్‌లో రౌడీ హీరో సినిమా

టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). విజయ్ తన నటనా నైపుణ్యంతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు.

Last Updated : Sep 28, 2020, 04:31 PM IST
Vijay Devarakonda: సుకుమార్ డైరెక్షన్‌లో రౌడీ హీరో సినిమా

Vijay Devarakonda next movie with director sukumar: హైదరాబాద్: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). విజయ్ తన నటనా నైపుణ్యంతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు. అయితే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రముఖ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ (sukumar) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాను కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) అనే కొత్త నిర్మాత నిర్మించనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నట్లు కేదార్ సెలగంశెట్టి స్పష్టంచేశారు. అయితే ఈ ప్రకటనను తన పుట్టిన రోజు సందర్భంగా వెల్లడించారు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పుట్టిన రోజు తనకు చాలా స్పెషల్ అని.. ఎందుకంటే..  తనకు ఇష్టమైన వ్యక్తులతో సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ కేదార్ పేర్కొన్నారు.  Also read: SP Balasubrahmanyam News: వదంతులు సృష్టించి బాధపెట్టొద్దు: ఎస్పీ చరణ్

అయితే భారీ బడ్జేట్ సినిమా 2022లో ప్రారంభమవుతుందని, పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నట్లు కేదార్ వెల్లడించారు. ఈ సినిమా తారాగణం, టెక్కిషియన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని కేదార్ పేర్కొన్నారు. అంతేకాకుండా వారి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటించనున్నట్లు విజయ్ కూడా ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అయితే రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. క్రియేటివ్ డైరక్టర్‌ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమాను అనౌన్స్ చేయగానే అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ సినిమా భారీ ఎత్తున ఉంటుందంటూ రౌడీ హీరో అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే.. ప్ర‌స్తుతం సుకుమార్.. అల్లు అర్జున్‌ పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. కూడా పూరీ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఫైట‌ర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.   Also read: INDIGO: ఇండిగో విమానాన్ని ఢికొన్న పక్షి

Trending News