Family Star Pre Release Business: 'ఫ్యామిలీ స్టార్' ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ డీటెల్స్.. విజయ్ దేవరకొండ టార్గెట్ పెద్దదే..

Family Star Pre Release Business: విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 3, 2024, 03:25 PM IST
Family Star Pre Release Business: 'ఫ్యామిలీ స్టార్' ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ డీటెల్స్.. విజయ్ దేవరకొండ టార్గెట్ పెద్దదే..

Family Star Pre Release Business: 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కలయికలో వస్తోన్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు భారీ ఎత్తున నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో, హీరోయిన్స్‌తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా ఎంతో హుషారుగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిన సినిమాకు అన్ని ఏరియాల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక విజయ్ దేవరకొండ గత సినిమాల రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
తెలంగాణ (నైజాం)లో.. రూ. 13 కోట్లు..
రాయలసీమ( సీడెడ్).. రూ. 4.5 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 17 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్.. రూ. 3 కోట్లు
ఓవర్సీస్ .. రూ. 5.5 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే రూ. 44 కోట్లు రాబట్టాలి. మొత్తంగా విజయ్ దేవరకొండ గత సినిమాల బిజినెస్‌తో సంబంధం లేకుండా మంచి బిజినెస్ చేసింది. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టి బాక్సాఫీస్ విజేతగా నిలుస్తాడా ? లేదా అనేది చూడాలి.

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News