Vijay Devarakonda Appears before Enforcement Directorate : విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాని పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తూ తెరకెక్కించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్, అపూర్వ మెహతా, పూరీ కనెక్ట్స బ్యానర్ మీద ఛార్మీ, పూరీ జగన్నాధ్ ఇనిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.
ఈ సినిమా ఊహించిన మేర అంచనాలను అందుకోలేకపోయింది కానీ వివాదాల పాలయ్యేలా చేసింది. ఈ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు సైతం నష్ట పోయాం తమకు డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే రోడ్ ఎక్కుతామని అంటూ పూరి జగన్నాథ్ ని హెచ్చరించే స్థాయికి వచ్చారంటే ఈ సినిమా వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాలో తెలంగాణ కీలక నేత కల్వకుంట్ల కవిత పెట్టుబడులు పెట్టారంటూ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంలోకి ఈడి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత నిజంగానే పూరి జగన్నాథ్ ఛార్మి కౌర్ అకౌంట్స్ లోకి విదేశాల నుంచి కూడా కొంత డబ్బు లెక్కల్లో చూపని విధంగా వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడితో ఈ కేసు వ్యవహారం ముగుస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండను కూడా ఈడీ విచారణకు పిలిపించినట్లుగా తెలుస్తోంది. ఈరోజు విజయ్ దేవరకొండ ఈడి విచారణకు హాజరు హాజరైనట్లు చెబుతున్నారు.
విదేశాల నుంచి అలాగే పలువురు రాజకీయ నేతల ఖాతాల నుంచి డబ్బులు పూరీ జగన్నాథ్ అలాగే చార్మికౌర్ అకౌంట్స్ కి బదిలీ అయినట్లుగా అయితే ఈడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా లైగర్ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. మైక్ టైసన్ లాంటి వ్యక్తి ఈ సినిమాలో కనిపించడంతో కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నారు కానీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో పూరి విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించగా అలీ ఒక కీలక పాత్రలో నటించాడు.
Also Read: ఆరు ప్రాణాలను మింగిన పొగమంచు.. రోడ్డు ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు?
Also Read: మళ్లీ మాట తప్పిన రామ్ చరణ్.. అలాంటి సినిమా చేయనంటూనే రీమేక్స్ పై కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook