Kushi Movie: ఓటీటీలోకి రాబోతున్న 'ఖుషి'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Kushi Movie: ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన విజయ్ దేవరకొండ ఖుషి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. త్వరలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఇది ఏ ఓటీటీలో రానుందంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2023, 02:31 PM IST
Kushi Movie: ఓటీటీలోకి రాబోతున్న 'ఖుషి'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Kushi in OTT: రౌడీ హీరో విజయ్ దేవరకొండ-స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఖుషి మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. సెప్టెంబరు 01న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. విజయ్ కెరీర్ లోని భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. విజయ్‌, సమంతల మధ్య కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్, జయరాం, సచిన్‌ కేడ్కర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణీ తదితరులు కీ రోల్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి ఖుషి సినిమాను నిర్మించారు. 

అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. ఈ మూవీ అక్టోబరు 06 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమాకు హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా వ్యవహరించారు. 

మరోవైపు విజయ్ ఖుషి సినిమా తర్వాత పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. VD13 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా మృణాళ్‌ ఠాకూర్‌ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. గతంలో విజయ్-పరుశురామ్ కాంబినేషన్ లో గీత గోవిందం అనే సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 

Also Read: Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News