Vidyullekha Raman: ఘనంగా లేడీ క‌మెడియ‌న్ ఎంగేజ్‌మెంట్

అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో లేడీ కమెడియన్‌గా విద్యుల్లేఖ రామన్ (Vidyullekha Raman) తనదైన ముద్రను వేసుకుంది. ఇటీవల కాలంలో ఆమె చేసిన ప్రతీ సినిమాలో తనదైన స్టైల్లో హాస్యాన్ని పండించి.. తమిళం, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది.

Last Updated : Sep 1, 2020, 11:57 AM IST
Vidyullekha Raman: ఘనంగా లేడీ క‌మెడియ‌న్ ఎంగేజ్‌మెంట్

Lady Comedian Vidyullekha Raman Engagement: అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో లేడీ కమెడియన్‌గా విద్యుల్లేఖ రామన్ (Vidyullekha Raman) తనదైన ముద్రను వేసుకుంది. ఇటీవల కాలంలో ఆమె చేసిన ప్రతీ సినిమాలో తనదైన స్టైల్లో హాస్యాన్ని పండించి.. తమిళం, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని  సంపాదించుకుంది. బొద్దుగా ఉంటూ అందరిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ విద్యుల్లేఖ స్లిమ్‌గా మారిన ఫోటోను కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరూ అవాక్కయ్యేలా చేసింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తాజాగా త‌న‌కు కాబోయే భ‌ర్త ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Lady Comedian Vidyullekha Raman Engagement

ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడైన సంజయ్‌తో ఆగ‌స్ట్ 26న రోకా ( ఎంగేజ్‌మెంట్ ) వేడుక జ‌రిగిన‌ట్టు విద్యుల్లేఖ రామన్ పేర్కొంది. ఈ వేడుక ( vidyullekha raman engaged) ను కోవిడ్ నిబంధనలతో నిర్వహించామని.. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని చెప్పింది. అయితే.. ఫొటోల కోసమే మాస్కులు తొల‌గించామ‌ని.. అప్పటివరకు మాస్కులు ధరించామని.. ఎవ్వరూ ట్రోల్ చేయ్యకుండా చెప్పకనే చెప్పింది ఈ అమ్మడు. అయితే.. పెళ్ళి ఎప్పుడు జరుగుతుందన్న విషయాన్ని మాత్రం విద్యుల్లేఖ వెల్లడించలేదు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు అంగీకరించడంతో నిశ్చితార్థం జరిగిందని చెప్పుకుంటున్నారు. అభిమానులు.. Also read: Maadhavi Latha: డ్రగ్స్ మత్తులో టాలీవుడ్‌.. సార్లు ఓ కన్నేయండి

Vidyullekha

Trending News