F3 Movie: F3 మూవీ ఎక్కడివరకు వచ్చింది ? లేటెస్ట్ అప్‌డేట్స్..

వెంకటేష్ ప్రస్తుతం యాక్షన్ డ్రామా చిత్రం అయిన నారప్ప సినిమాలో ( Narappa movie ) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నుండి తిరిగి ప్రారంభించడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

Last Updated : Sep 5, 2020, 04:21 PM IST
F3 Movie: F3 మూవీ ఎక్కడివరకు వచ్చింది ? లేటెస్ట్ అప్‌డేట్స్..

విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) ప్రస్తుతం యాక్షన్ డ్రామా చిత్రం అయిన నారప్ప సినిమాలో ( Narappa movie ) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నుండి తిరిగి ప్రారంభించడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అలాగే అక్టోబర్ చివరి నాటికి వెంకీ తన షూటింగ్‌ని ముగించుకొని ఆ తరువాత తన తదుపరి ప్రాజెక్ట్ అయిన 'F3' సినిమా షూటింగ్‌కి ( F3 movie shooting ) హాజరు కానున్నాడు. 'F2' మూవీకి సీక్వెల్‌గా ( F2 movie sequel ) సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాను కూడా తొలి భాగాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడినే ( Anil Ravipudi ) డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే వెంకీ, వరుణ్ తేజ్‌లు ఎఫ్3 స్క్రిప్ట్‌కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది. Also read : V Movie leaked: పైరసీ బారిన పడిన V ఫుల్ మూవీ

F3 మూవీలో వెంకటేష్, వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, మెహ్రీన్ కౌర్ పిర్జాదాతో పాటు మరో కొత్త జంట కనిపించనున్నారు. జూమ్ కాల్‌లో అనిల్ రావిపూడి వారికి కథని వినిపించినట్టు సమాచారం. ఆ మరో జంటలో ఒక కొత్త హీరో ఖరారైనట్టు టాక్. ఇప్పుడు అనిల్ మరొక హీరోయిన్ కోసం చూస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. Also read : Pawan Kalyan in web series: పవన్ కల్యాణ్ వెబ్‌సిరీస్ చేస్తారా ?

ఈ చిత్ర షూటింగ్ ఏ అవాంతరాలు లేకుండా షెడ్యూల్ ప్రకారం జరిగితే.. మే 2021లో విడుదల అవనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఎఫ్ 3 మూవీని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. Also read : అన్నీ రుచి చూశా అంటున్న హీరోయిన్

Trending News