Venkatesh: ముందు డాన్స్.. ఆ తరువాత మహేష్ బాబుతో క్లబ్ హౌస్ కి.. నిన్న రాత్రి వెంకటేష్ సందడి..

Venkatesh and Mahesh Babu: ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎంతో సరదాగా కనిపించే హీరో వెంకటేష్. ఆయనంటే ఇష్టపడని వారు తెలుగు ప్రేక్షకులలో ఎవరు ఉండరు. అంతలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ హీరో నిన్న రాత్రి చేసిన సందడి అందరినీ అల్లరిస్తోంది. ముందుగా డాన్స్ వేసి ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో దిగిన ఫోటోలు అలానే ఆయన డాన్స్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మరి ఆ విశేషాలు అన్నీ మనము కూడా ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2023, 09:27 AM IST
Venkatesh: ముందు డాన్స్.. ఆ తరువాత మహేష్ బాబుతో క్లబ్ హౌస్ కి.. నిన్న రాత్రి వెంకటేష్ సందడి..

Venkatesh Dance: మన వెంకీ మామని ఇష్టపడని వారు ఎవరుంటారు. విక్టరీ వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఇష్టపడే హీరో అని మన అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ అనే కాదు ఏ వయసు వారైనా.. అలానే ఏ హీరో అభిమాని అయిన వెంకటేష్ ని ఇష్టపడని వారు అయితే మనకు పెద్దగా కనిపించరు. అందుకు ముఖ్య కారణం ఆయన ఆన్ స్క్రీన్ యాక్టింగ్.. అలానే ఆయన ఆఫ్ స్క్రీన్ వ్యక్తిత్వం.

వివాదాల జోలికి వెళ్లకుండా సరదాగా తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు వెంకటేష్. ఇక ప్రస్తుతం ఈ హీరో తన సైంధవ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కాగా తన సినిమా షూటింగ్ కి గ్యాప్ తీసుకొని నిన్న రాత్రి సందడి చేశారు.

ముందుగా ఈ హీరో నిన్న రాత్రి లారెన్స్, ఎస్ జె సూర్య ప్రాధానపాత్రలో కనిపిస్తున్న 'జిగర్తాందా డబల్ ఎక్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం గతంలో వచ్చిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్. ఇక ఈ సినిమా తెలుగులో దీపావళి కానుకగా నవంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగులో నిన్న రాత్రి నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు వెంకటేష్ గెస్ట్ గా వెళ్లారు.

ఇక ఏ ఫంక్షన్ అయినా సరదాగా గడిపే మన వెంకి మామ నిన్న ఏకంగా డాన్స్ కూడా వేశారు. రాఘవ లారెన్స్ తో కలిసి వెంకటేష్ తన సూపర్ హిట్ సినిమా ప్రేమించుకుందాం రా లోని ‘పెళ్లి కల వచ్చేసింది బాల..’ అంటూ సాగే పాటకు స్టెప్పులు వేసి అల్లరించాడు. వెంకటేష్ ఈవెంట్ కి రాగా ఈ పాట ప్లే చేశారు. ఇక ఆ పాటకి అప్పట్లో స్టెప్పులు కంపోజు చేసిన లారెన్స్ ఇప్పుడు కూడా అవే స్టెప్పులు వేస్తూ వెంకటేష్ ని కూడా వేయమనడంతో.. వెంటనే ఆయన లారెన్స్ తో కలిసి ఆ సిగ్నేచర్ స్టెప్ వేశారు. ఇక ఇది చూసిన అక్కడ ఉన్న ప్రేక్షకులకు కనుల పండుగగా ఉండింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News