Gandeevadhari Arjuna Trailer: 'భూమికి పట్టిన అతి పెద్ద క్యాన్సర్ మనిషేనేమో..': ఉత్కంఠగా వరుణ్ తేజ్ 'గాంఢీవధారి అర్జున' ట్రైలర్‌..

Gandeevadhari Arjuna Trailer:  వరుణ్‌తేజ్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం తెరకెక్కుతున్న మూవీ ‘గాండీవధారి అర్జున'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2023, 05:01 PM IST
Gandeevadhari Arjuna Trailer:  'భూమికి పట్టిన అతి పెద్ద క్యాన్సర్ మనిషేనేమో..': ఉత్కంఠగా వరుణ్ తేజ్ 'గాంఢీవధారి అర్జున' ట్రైలర్‌..

Gandeevadhari Arjuna Trailer: మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున' (Gandeevadhari Arjuna). ప్రవీణ్‌ సత్తారు(Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించారు. యాక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాను ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సంద‌ర్భంగా గురువారం ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. 

“డిసెంబ‌ర్ 2020లో దేవుడు మీద మ‌నిషి గెలిచాడంట‌.. జ‌స్ట్ పాతికవేల సంవ‌త్సరాల‌లో మ‌నిషి చేసిన వ‌స్తువులు దేవుడు చేసిన వాటిని మించేశాయంట. ఎలాగో తెలుసా..? అనే నాజ‌ర్ డైలాగ్ తో ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ తో నిండిపోయింది. ఇందులో వరుణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. 'భూమికి పట్టిన అతి పెద్ద క్యాన్సర్ మనిషేనేమో..' అని చివర్లో నాజర్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. దేశాన్ని కాపాడే ఓ సీక్రెట్ ఏజెంట్ గా వరుణ్ కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News