Varasudu Preponed: ఒక రోజు ముందుకు వారసుడు సినిమా.. చివరి నిముషంలో దిల్ రాజు మాస్టర్ ప్లాన్!

Varasudu - Varisu To Release on January 11: దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన వారసుడు సినిమాను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది సినిమా యూనిట్. ఆ వివరాలు   

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 5, 2023, 04:13 PM IST
Varasudu Preponed: ఒక రోజు ముందుకు వారసుడు సినిమా.. చివరి నిముషంలో దిల్ రాజు మాస్టర్ ప్లాన్!

Varasudu - Varisu To Release on January 11: 2023 సంక్రాంతికి వరుస సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య నందమూరి, బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అదే విధంగా దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వారిసు’ని తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ముందుగా వారసుడు సినిమాని జనవరి 12వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు అదే జనవరి 12వ తేదీన నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా కూడా రిలీజ్ చేయాలని భావించారు. ఇక జనవరి 13వ తేదీన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు అయితే అజిత్ హీరోగా రూపొందిన తునివు అనే సినిమాని తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ముందు నుంచి సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెబుతూ వచ్చారు కానీ ఇప్పటివరకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా కానీ ఈ సినిమాని 11వ తేదీ విడుదల చేస్తున్నట్లు సినిమా నిర్మాత బోనీ కపూర్ ప్రకటించడంతో దిల్ రాజు కూడా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వారసుడు సినిమాని కూడా ఒకరోజు ముందే అంటే 11వ తేదీనే తెగింపు సినిమాకి పోటీగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఒకరకంగా అజిత్, విజయ్ సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అవుతున్నట్లుగా చెప్పాలి. ఇక వీళ్ళిద్దరికి తమిళంలో మంచి పోటీ ఉంటుంది.

అయితే తమిళంలో పోటాపోటీగా రిలీజ్ చేస్తున్నా సరే తెలుగు విషయంలో మాత్రం ఎందుకో అలసత్వం కనిపిస్తోంది. అయితే  దిల్ రాజు వారసుడు సినిమాకి నిర్మాత కావడం ఆయన చేతిలో ఎక్కువగా దియేటర్లు ఉండడంతో తెలుగు సినిమాలు అయిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల థియేటర్ల కంటే వారుసుడికి ఎక్కువ ధియేటర్లు దొరుకుతున్నాయి. ఇక ఈ డేట్ ముందుకు జరగడం వల్ల సంక్రాంతి సినిమాలకు ముందే డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లుంది.

ఇక చేతిలో ధియేటర్లో ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్స్ కి కూడా ఎలాంటి ఢోకా ఉండదని అంటున్నారు. అదే విధంగా మరోపక్క అజిత్ తెగింపు సినిమాని కూడా రెండు ప్రాంతాల్లో దిల్ రాజు రిలీజ్ చేస్తూ ఉండడం గమనార్హం. కాబట్టి వారసుడు సినిమా వసూళ్లు ఎలాగో బాగానే వస్తాయి, తెగింపు సినిమా కూడా ఆడితే అది తనకు మరింత కలిసి వస్తుంది అని దిల్ రాజు భావిస్తున్నాడు.  చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది.
Also Read: Hebah Patel Hot Photos: పొట్టి బట్టల్లో కుమారి అందాల విందు.. రెచ్చిపోయిన హెబ్బా.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Also Read: Kishan Reddy Comments: తెలంగాణ వాళ్ల కోసం కాదు, వేరే వాళ్ల కోసం దర్యాప్తు చేస్తుంటే వీళ్ల పేర్లు బయటకొచ్చాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News