UV Creations GST Raids: ప్రభాస్ సొంత సంస్థపై జీఎస్టీ రైడ్స్.. టాలీవుడ్లో కలకలం!

GST Raids on Prabhas's own Production House: ప్రభాస్ సన్నిహితులచే స్థాపించబడి కేవలం ప్రభాస్, ఆయన సన్నిహితులతోనే సినిమాలు చేస్తూ వస్తోంది యూవీ ప్రొడక్షన్స్ సంస్థ.. ఈ క్రమంలో ఈ సంస్థపై జీఎస్టీ రైడ్స్ కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 2, 2022, 09:27 AM IST
UV Creations GST Raids: ప్రభాస్ సొంత సంస్థపై జీఎస్టీ రైడ్స్.. టాలీవుడ్లో కలకలం!

UV Productions GST Raids: టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన యూవీ క్రియేషన్స్ సంస్థ మీద జీఎస్టీ అధికారులు రైడ్స్ జరిపిన విషయం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. యూవీ క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ అధికారులు భావిస్తూ మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ కార్యాలయాల మీద సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలు విడుదల చేసిన సమయంలో పన్ను ఏదైనా ఎగవేశారా? అనే విషయం మీద అధికారులు తనిఖీ చేసి ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం మంగళవారం పొద్దుపోయే వరకు బయటకు రాలేదు. ఈ విషయం మీద జీఎస్టీ అధికారులు కూడా ఎలాంటి ప్రకటన చేయకపోగా యూవీ క్రియేషన్స్ సంస్థ మాత్రం ఇలాంటి తనిఖీలు సర్వసాధారణం అని గతంలో కూడా జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరిగాయని చెబుతోంది. యువీ క్రియేషన్స్ సంస్థను హీరో ప్రభాస్ వరుసకు సోదరుడైన ప్రమోద్ ఉప్పలపాటి ఆయన స్నేహితులు వంశీకృష్ణారెడ్డి, విక్రమ్ కృష్ణారెడ్డితో కలిసి ముంబై బేస్ తో 2013వ సంవత్సరంలో స్థాపించారు.

ఈ సినిమా నుంచి మొదటి సినిమాగా ప్రభాస్ హీరోగా మిర్చి అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ కు సన్నిహితంగా ఉన్న వారితోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ నిర్మాణ సంస్థ నాని హీరోగా భలే భలే మగాడివోయ్, శర్వానంద్ హీరోగా ఎక్స్ప్రెస్, రాజా రన్ రాజా రన్, మహానుభావుడు గోపీచంద్ హీరోగా జిల్, పక్కా కమర్షియల్, సంతోష్ శోభన్ హీరోగా ఏక్ మినీ కథ, అనుష్క హీరోయిన్ గా విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్, సాహో వంటి సినిమాలు నిర్మించారు.

ఇప్పుడు కూడా ఆది పురుష్ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలు ఫ్లాప్ అవుతున్నా అన్ని కోట్ల రూపాయలను ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ సందర్భంగా జీఎస్టీ ఏమైనా ఎగ్గొడుతున్నారా అనే విషయం మీద జిఎస్టి రైట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద జీఎస్టీ అధికారిక ప్రకటన చేస్తే కానీ పూర్తి వివరాలు క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Also Read: Jr NTR Speech At Kannada Rajyotsava : మాటల్లోనూ చేతల్లోనూ మేటి.. పునీత్‌పై ప్రేమ, మహిళలపై గౌరవం.. దటీజ్ ఎన్టీఆర్

Also Read: Godfather OTT Release Date: నెట్ ఫ్లిక్స్ లో గాడ్ ఫాదర్.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News