Uppena movie expectations: టాలీవుడ్‌లో ఉప్పెన ఎందుకు చర్చనీయాంశంగా మారిందో తెలుసా

Uppena movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉప్పెన సినిమా చర్చనీయాంశంగా మారింది. మెగా కుటుంబం నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేస్తున్న సినిమా ఇది. 99 శాతం కొత్తవాళ్లతో వస్తున్న ఉప్పెన..విరుచుకుపడేనా లేదా. అసలీ సినిమాలో ప్రత్యేకతలేంటి  

Last Updated : Feb 11, 2021, 09:51 PM IST
Uppena movie expectations: టాలీవుడ్‌లో ఉప్పెన ఎందుకు చర్చనీయాంశంగా మారిందో తెలుసా

Uppena movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉప్పెన సినిమా చర్చనీయాంశంగా మారింది. మెగా కుటుంబం నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేస్తున్న సినిమా ఇది. 99 శాతం కొత్తవాళ్లతో వస్తున్న ఉప్పెన..విరుచుకుపడేనా లేదా. అసలీ సినిమాలో ప్రత్యేకతలేంటి

మెగాస్టార్ చిరంజీవి ( Megastar chiranjeevi ) కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీకు పరిచయం కాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ( Vaishnav tej )ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఒక్కరు తప్ప అందరూ కొత్తవాళ్లతో ఈ సినిమా రావడం చాలా విశేషం. విజయ్ సేతుపతి మినహా అందరూ ఈ సినిమాలో కొత్తవాళ్లే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన సినిమా మరి కొద్దిగంటల్లోనే విడుదల కానుంది. అసలీ సినిమాకు చాలా హైప్ వచ్చింది. ఎందుకంటే..

ఉప్పెన సినిమా ( Uppena movie )కు తెలుగులో భారీ హైప్ రావడానికి కారణం విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి ( Vijay sethupati ) విలనిజం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. మెగా కుటుంబం నుంచి వారసుడు వస్తుండటంతో ఆసక్తి బాగా పెరిగింది. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ఇది. కృతి శెట్టి ఫీలింగ్స్ ప్రధానమైన బలం ఈ సినిమాకు. ఇక దేవి శ్రీ ప్రసాద్ పాటలు కూడా ఉప్పెనపై ఆసక్తిని విపరీతంగా పెంచేశాయి. మరీ ముఖ్యంగా నీ కన్ను నీలి సముద్రం పాట ఏడాదిగా అందరి నోళ్లలో ఆడుతూనే ఉంది. ప్రాచుర్యం పొందింది.  ఇక ఈ కొత్త హీరో సినిమా కోసం క్రేజీ నిర్మాణ సంస్థలు కలిసి రావడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ ( Sukumar ) రైటింగ్స్ సంస్థలు కావడంతో చాలా ఆసక్తిగా మారింది. చాలా రోజుల్నించి ఉప్పెన క్రైమాక్స్‌పై చర్చ సాగుతుంది. విషాదాంతమైన ప్రేమ కధ అని ఒకరు, హీరో మర్మాంగాన్ని ఎవరో కోసేస్తారని మరొకరు ఇలా భారీగానే చర్చ సాగుతోంది. 

Also read: Sreekaram Teaser: Farmer పాత్రలో శర్వానంద్.. ఆసక్తి రేకెత్తిస్తున్న dialogues..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News