Upasana - UP CM Yogi: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన రామ్ చరణ్ భార్య ఉపాసన..

Upasana Konidela - UP CM Yogi: మెగా పవర్ స్టార్ భార్య ఉపాసన కొణిదెల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్బంగా  యూపీ సీఎం అపోలో హాస్పిటల్‌కు సంబంధించిన హిందీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 12, 2024, 11:08 AM IST
Upasana - UP CM Yogi: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన రామ్ చరణ్ భార్య ఉపాసన..

Upasana Konidela - UP CM Yogi: మెగా స్టార్ ఇంటి కోడలైన ఉపాసన కొణిదెల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగానే కాకుండా.. అపోలో హాస్పిటల్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో ఈమె చురుగ్గా పాల్గొంటూ సామాన్యులకు సైతం అండగా ఉంటున్నారు. అంతేకాదు అపోలో మ్యాగజైన్‌కు సంబంధించి పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ వార్తల్లో నిలిచింది. గతేడాది ఈ దంపతులు ఓ కూతురుకు జన్మనిచ్చారు. ఈమెకు క్లీంకార అనే పేరు పెట్టారు. తాజాగా ఈమె అయోధ్యలో కొలువైన రామ మందిరాన్ని సందర్శించారు. అంతేకాదు అక్కడ ఆమె అపోలో హాస్పిటల్‌కు సంబంధించి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎమర్జన్సీ కేర్‌ను ప్రారంభించారు. అక్కడ వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఇక్కడ ఉచిత సేవలు అపోలో హాస్పిటల్ నుంచి అందించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అపోలో హాస్పటల్‌కు ప్రస్థానానికి సంబంధించిన హిందీ పుస్తకాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఆవిష్కరింపచేసారు. 

ఇందులో అపోలో హాస్పిటల్ ఎలా ప్రారంభమైంది. ఇపుడు అంచలంచెలుగా ఎలా ఎదిగిందనేది ఈ పుస్తకంలో ఉంది. రీసెంట్‌గా ఉపాసన, రామ్ చరణ్ దంపుతలు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో సందడి చేసిన సంగతి తెలిసిందే కదా.  మరోవైపు ఉపాసన భర్త రామ్ చరణ్ విషయానికొస్తే.. రాజమౌళి డైరెక్షన్‌లో  తెరరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో రామ్ చరణ్ ప్యాన్ ఇండియా లెవల్లోనే కాదు.. గ్లోబల్ లెవల్లో  పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా ఒదిగిపోయాడు. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రతి సినిమాను గ్లోబల్ లెవల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్  శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంచర్' మూవీ చేస్తున్నారు. 

ఈ  సినిమా ఈ యేడాది డిసెంబర్ చివరి వారంలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.  ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో రామ్ చరణ్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు.  విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న  ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. 

Also read: Social Media Harassment: సోషల్ మీడియాలో పైశాచిక ట్రోలింగ్, తట్టుకోలేక ఓ అభాగ్యురాలి ఆత్మహత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News