Upasana Konidela FaceBook Post: హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సమాజంలోని పలు అంశాలపై తరుచూ పోస్ట్స్ చేస్తుంటారు. హెల్త్‌కు సంబంధించిన అంశాలతో పాటు పలు సామాజిక అంశాలపై కూడా ఉపాసన (Upasana) సోషల్ మీడియాలో పోస్ట్స్ చేస్తుంటారు. అలాగే ప్రజలను చైతన్యపరిచే పోస్ట్స్ కూడా చాలానే చేస్తుంటారు ఉపాసన.
అయితే మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసనను నెటిజెన్స్ (Netizens) ట్రోల్ చేస్తున్నారు. ఉపాసన ఫేస్‌బుక్ (Upasana Facebook) అకౌంట్ వేదికగా నెటిజెన్స్ విమర్శలు చేస్తున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. ఉపాసన తన ఫేస్‌బుక్‌లో తాజాగా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే.. ఒక ఆలయానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. ఆ ఆలయ గోపురంపై దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు ప్రజలు నిలుచున్నట్లుగా ఫోటోను ఎడిట్ చేశారు.
ఆలయ (Temple) గోపురంపై అతి చిన్నగా ఉండే ఆ మనుషుల ఫోటోల్లో తానూ, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నామంటూ ఉపాసన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లో పేర్కొంది. తాము ఆ ఫోటోలో ఎక్కడున్నామో కనుక్కోండి అంటూ ఉపాసన ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
అంతేకాదు శోభన కామినేని తనకు ఈ ఫోటో పంపించారని ఆ ఫోటో తనకు ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చింది ఉపాసన. అలా ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ తనకు డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తే అభినందించాలని ఉందంటూ ఉపాసన తెలిపింది. అయితే మెగా కోడలు ఉపాసన పోస్ట్ చేసిన ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌పై ఇప్పుడు నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు.
సోషల్ మీడియా (Social Media) వేదిక ద్వారా ఇంతకాలం తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న ఉపాసనపై నెటిజెన్స్ ఇప్పుడు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసనపై విమర్శలు చేస్తున్నారు.
Also Read : జాన్వీ కపూర్‌కి పాఠాలు నేర్పుతోన్న టీమిండియా క్రికెటర్.. ఎందుకోసమో తెలుసా?
ఫోటోను అలా తీర్చిదిద్దిన ఆర్టిస్ట్‌ను మెచ్చుకోవడంకంటే, అలాంటి గోపురాన్ని వేలాది సంవత్సరాల క్రితం నిర్మించిన కళాకారులను మెచ్చుకోండి అంటూ ఉపాసనకు (Upasana) సూచనలు చేస్తున్నారు. కొందరేమో వివాదస్పదంగా ఉన్న ఆ పోస్ట్‌ను (Post) వెంటే డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Mouni Roy Wedding: గోవాలో మౌనీరాయ్ పెళ్లి.. హల్దీ ఫంక్షన్ లో నాగిని బ్యూటీ సందడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook