Ram Charan in Balayya Talk Show Unsoppable Season 4: నందమూరి బాలకృష్ణ హీరోగా కాకుండా ఎమ్మెల్యేగా.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తున్నారు.అంతేకాదు అన్ స్టాపబుల్ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 4వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు, సూర్య, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, వెంకటేష్ వంటి వారు సందడి చేసారు. ఈ సారి అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్ సందడి చేశారు. తన గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈషోలో సందడి చేశారు. ఈ షోలో రామ్ చరణ్ ను పలు ఇబ్బంది కరమైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసారు బాలయ్య. ఈ సందర్భంగా మీకు రామ్ చరణ్ నాన్నమ్మ గారైన అంజనా దేవితో పాటు అమ్మ సురేఖ గారు రామ్ చరణ్ ను మంచి కోరిక కోరారు. 2025లో మాకో మనవడిని ఇవ్వమని అడిగారు. ఈ సీన్ లో నేను జస్ట్ నారదుడిని మాత్రమే అని బాలయ్య చెప్పడం కొసమెరుపు.
మరోవైపు దోస, ఆమ్లెట్ మీ అమ్మగారు అదరగొడతారు అని బాలయ్య ప్రశ్నకు .. రామ్ చరణ్.. దోస, ఆమ్లెట్ ఎవరైనా చేస్తారని సింపుల్ సమాధానం ఇచ్చాడు. ఉపాసన కాకుండా ప్రతి పండక్కి ఆవిడను కలవడం మాత్రం మిస్ అవ్వవుగా అని బాలయ్య అని కొంటె ప్రశ్నకు రామ్ చరణ్ బిత్తర పోవడం వంటివి ఈ షోలో ప్రత్యేకం అని చెప్పాలి.
చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లలో పార్టీకి వెళ్లాలంటే ఎవరితో వెళతావు అంటే.. ఈ ముగ్గురితో కాదు.. మావయ్య అల్లు అరవింద్ తో వెళతా అని గడసు సమాధానం చెప్పాడు రామ్ చరణ్. 2023లో మీ నాన్నకు క్లీంకారతో మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా కూతురితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. మరోవైపు బాలయ్య.. క్లీంకారను ఎపుడు చూపిస్తావు అనే ప్రశ్నకు నా కూతురు నన్ను నాన్న అని పిలిచే రోజు అందరికీ చూపిస్తా అని అన్ స్టాపబుల్ వేదికగా అభిమానులకు మాట ఇచ్చాడు. ఆడ పిల్ల పుడితే..ఇంట్లో అమ్మవారు పుట్టినట్టే అని బాలయ్య చెప్పడంతో రామ్ చరణ్ మరింత ఎమోషనల్ అయ్యాడు.
ఈ షోలో తన కుక్క పిల్లను పెంచాడు. అంతేకాదు రామ్ చరణ్ కుక్క కూడా రికార్డు క్రియేట్ చేసినట్టు చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్.. పొలిటిషన్ గా బెటరా..యాక్టర్ గా బెటరా.. అని బాలయ్య అని ప్రశ్నకు రామ్ చరణ్.. తనని ట్రబుల్ పెట్టడానికే అడిగినట్టు ఉంది ఈ ప్రశ్న అని ఒకింత ఇబ్బంది పడ్డట్టు చెప్పాడు. నీకు ఉపాసన అంటే భయమా..? నీకు పర్సనల్ గా ప్రభాస్ కన్ఫర్టా.. మహేష్ బాబు కన్ఫర్టా.. అని అడిడిన ప్రశ్నకు .. నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. మరోవైపు ఈ షోలో ప్రభాస్ కు బాలయ్య కాల్ చేయడం..ప్రభాస్ పెళ్లి ఎపుడు అని అడగటం.. మీ నుంచి కాల్ వస్తే.. నాకు కాదు టెన్షన్.. రామ్ చరణ్ కు టెన్షన్ అంటూ చెప్పడం కొసమెరుపు. ఈ షోలో శర్వానంద్, నిర్మాత దిల్ రాజుతో పాటు రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ జాయిన్ య్యారు. మొత్తంగా రామ్ చరణ్.. బాలయ్యతో పంచుకున్న ముచ్చట్లు తెలియాలంటే ఈ నెల 8న 7 గంటలకు ఆహా ఓటీటీ చూడాల్సిందే.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.