Nachindi Girlfriendu Movie Review : ఆటగదరా, మిస్ మ్యాచ్ వంటి సినిమాలతో మంచి నటుడిగా మెప్పించిన ఉదయ్ శంకర్ ఇప్పుడు నచ్చింది గాళ్‌ఫ్రెండూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేడు (నవంబర్ 11) ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయో.. ఆడియెన్స్‌ను ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుంది? అనేది ఓ సారి చూద్దాం.
కథ
రాజా (ఉదయ్ శంకర్) బీకామ్‌తోనే చదువు ఆపేస్తాయి. షేర్ మార్కెట్ అంటూ పెట్టుబడులు పెడుతూ ఉంటాడు. అలాంటి రాజా తొలిచూపులోనే శాండీ (జెన్నీఫర్) ఫోటోను చూసి ప్రేమలో పడతాడు. ఫోటోను చూసిన అదే రోజు శాండీని రాజా కలుస్తాడు. ఇక అదే రోజు శాండీ పుట్టిన రోజు కూడా. అయితే శాండీకి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఓ సందేశం వస్తుంది. నువ్ ఎవరితో మాట్లాడితే వారిని చంపేస్తాను అంటూ ఓ సందేశం వస్తుంది. కానీ శాండీ ఎవరితో మాట్లాడుతూ ఉన్నా.. వాళ్లు చనిపోతుంటారు. అలా చివరకు రాజా కూడా శాండీతో మాట్లాడుతాడు. శాండీ సైతం ప్రేమించినట్టుగా నటిస్తుంది. చివరకు రాహుల్ అనే వ్యక్తి శాండీ జీవితంలో ఉన్నాడని రాజాకు తెలుస్తుంది? అసలు శాండీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? శాండీతో మాట్లాడిన వాళ్లని చంపే వ్యక్తి ఎవరు? ఈ కథలో మధు నందన్ ఏం చేశాడు? విక్రమ్ రాయ్ పాత్ర ఏంటి? కృష్ణ పాండే (శ్రీకాంత్ అయ్యంగార్) వల్ల ఎలాంటి మలుపు తిరుగుతంది? చివరకు రాజా వీటన్నంటికి చెక్ పెడతాడా? శాండీతో కథ సుఖాంతం అవుతుందా? అన్నది మిగతా కథ.
నటీనటులు
నచ్చింది గాళ్‌ఫ్రెండూ సినిమా అంతా కూడా ఉదయ్ శంకర్, జెన్నీఫర్ చుట్టే తిరుగుతుంటుంది. పనీపాట లేని అల్లరి చిల్లరగా తిరిగే రాజా పాత్రలో ఉదయ్ శంకర్ మెప్పించాడు. కానీ చివర్లో ఉదయ్ శంకర్ డైలాగ్స్, స్పీచులు, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఆశ్చర్యపరుస్తాయి. ఇక మొదటి సినిమా కావడంతో జెన్నీఫర్ అందాలను విపరీతంగా ప్రదర్శించేసింది. కుర్రాళ్లకు జెన్నీఫర్ బాగానే నచ్చేస్తుంది. మధు నందన్ తన కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రల్లో శ్రీకాంత్ అయ్యంగార్, విలన్, సుమన్ ఇలా అందరూ కూడా మెప్పించారు. మధ్యలో వచ్చిన కమెడియన్ పృథ్వీ పేటీఎం ప్రసాద్‌గా నవ్వులు పూయిస్తాడు.
విశ్లేషణ
నచ్చింది గాళ్‌ఫ్రెండూ అనే టైటిల్ కాస్త డిఫరెంట్‌గా ఉంది. టైటిల్ చూసి ఈ కథను మాత్రం కచ్చితంగా గెస్ చేయలేరు. ఈ సినిమాలో ప్రథమార్థం అంతా అలా సోసోగా నడుస్తూ వెళ్తుంది. అసలేం జరుగుతోంది? ఎవరు ఈ మర్డర్లు చేస్తున్నారనేది రివీల్ చేయరు. ఇంటర్వెల్ వరకు కాస్త సస్పెన్స్ వీడుతుంది. అప్పటి వరకు రొటీన్ లవ్ సీన్స్‌తో సినిమా నడిచినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రథమార్థం ముగిసి.. సెకండాఫ్‌లోకి సినిమా అడుగు పెడుతుందో అసలు కథ మెల్లిమెల్లిగా రివీల్ అవుతుంది. దీంతో క్లైమాక్స్ వరకు సినిమా ఉత్కంఠగా సాగుతుంది.
షేర్ మార్కెట్ల మీద జరిగే మోసాలు, మధ్య తరగతి వాళ్ల మీద ఉండే ప్రభావం, ఎక్కడో యుద్దం జరిగితే.. భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, లక్షల కోట్లు నష్టపోవడం వంటి అంశాల మీద ఈ సినిమా పాయింట్‌ను రాసుకున్నాడు. ఇప్పుడు అందరూ కూడా ఆన్ లైన్ ట్రేడింగ్ మీద ఫోకస్ పెట్టడంతో ఈ పాయింట్ అందరికీ ఈజీగా చేరుతుంది. ఇలాంటి కథ, కథనం రాసుకున్నప్పుడు మరింత గ్రిప్పింగ్‌గా స్టోరీని చెప్పి ఉంటే వేరే స్థాయిలో ఉండేది. దర్శకుడు తాను అనుకున్నది చెప్పేందుకు తన వంతుగా బాగానే కష్టపడ్డాడు.
ఈ చిత్రానికి పాటలు ప్లస్ అవుతాయి. ప్రతీ పాట, బీటు ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. ఇక మాటలు అక్కడక్కడా పేలినట్టుగా అనిపిస్తాయి. కెమెరాపనితనం బాగుంది. ఒకే రోజులో జరిగే కథ కావడంతో వైజాగ్‌లోని వీలైనన్ని అందాలన్నీ చూపించేశారు. ఇక ఎడిటింగ్ డిపార్ట్మెంట్ పని మాత్రం బ్యాలెన్స్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని సిల్లీ సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తోంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
రేటింగ్ : 2.5
Also Read : Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం
Also Read : Pushpa 2: ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్, పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook