RC vs PK: మా వాడే ఒరిజినల్ గాంగ్ స్టర్ అని కొట్టుకుంటున్న చరణ్, పవన్ ఫాన్స్!

Ram Charan and Pawan Kalyan fans: మెగా కుటుంబానికి చెందిన హీరోలే అయినా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే బిరుదు ఎవరికి దక్కాలి అనే విషయం మీద రాంచరణ్ అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయి గొడవ పడుతున్నారు. ఆ వివరాలు    

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 5, 2023, 09:01 AM IST
RC vs PK: మా వాడే ఒరిజినల్ గాంగ్ స్టర్ అని కొట్టుకుంటున్న చరణ్, పవన్ ఫాన్స్!

War between Ram Charan and Pawan Kalyan fans: హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్, ట్విట్టర్ వార్స్ జరగడం చాలా కామన్. ఎక్కువగా ఈ విషయం హీరోల మూవీ కలెక్షన్స్ గురించి వారి పెర్ఫార్మన్స్ గురించి అలాగే ఫ్యాన్ బేస్ గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అభిమానుల మధ్య ఈ వాదన ఈ రోజు నుంచి జరగడం లేదు అక్కినేని నాగేశ్వరరావు నందమూరి తారక రామారావు అభిమానుల రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి.

అయితే ఈ రోజుల్లో మాత్రమే ఈ ఫ్యాన్ వార్స్ అనేక రకాల మలుపులు తిరుగుతూ ఫ్రీ రిలీజ్ బిజినెస్ గురించి మొదలు పోస్ట్ రిలీజ్ శాటిలైట్ టిఆర్పి రేటింగ్ గురించి అంతెందుకు హీరోల ట్యాగ్ల గురించి కూడా జరుగుతున్నాయి. అయితే ఇదివరకు ఎక్కువగా వేర్వేరు కుటుంబాలకు చెందిన హీరోల మధ్య జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన హీరోల మధ్య కూడా జరుగుతూ వస్తున్నాయి.

ఆ మధ్య అల్లు అర్జున్ రామ్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరగగా ఒకరి మీద ఒకరు అసభ్యంగా రాసుకోలేని పదజాలం కూడా వాడారు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు మధ్య గొడవ మొదలైంది. ఈ ఇద్దరు మెగా కుటుంబానికి చెందిన హీరోలే అయినా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే బిరుదు ఎవరికి దక్కాలి అనే విషయం మీద రాంచరణ్ అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు.

 థె కాల్ హిం ఓ జి అనే సినిమా చేస్తున్నాడు అంటే వాళ్ళు ఆయనని ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని పిలుస్తారు అనేది ఆ సినిమా పేరు. ఎప్పుడైతే సుచిత్ ఈ మేరకు సినిమా ఓపెనింగ్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడో రాంచరణ్ అభిమానులు ఏమనుకున్నారో ఏమో రాంచరణ్ రియల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. అలా చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు వెనక్కి తగ్గుతారా? వారు కూడా రంగంలోకి దిగి రచ్చ మొదలుపెట్టారు.

అది ఎంతవరకు వెళ్ళింది అంటే ఒకరి కుటుంబాల గురించి భార్యల గురించి వ్యక్తిత్వాలు గురించి చర్చించుకునే దాకా వెళ్ళింది. నిజానికి ఇద్దరి హీరోల అభిమానులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకరు మెగాస్టార్ చిరంజీవి కుమారుడైతే మరొక మెగాస్టార్ చిరంజీవి సోదరుడు. వారికోసం అభిమానులు కొట్టుకోవడం రెండు వర్గాలుగా విడిపోవడం ఇతర హీరోల అభిమానులకు చులకన అవడమే కాక మెగా కుటుంబానికి కూడా ఇబ్బందిగా మారుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Also Read: Prabhas Fans Demand: మాకు అప్డేట్స్ కావాలి సార్.. ట్విట్టర్ ను కదిపేస్తున్న ప్రభాస్ ఫాన్స్!

Also Read: Remove Thaman From SSMB 28: తమన్ ను తీసేయమంటున్న మహేష్ ఫాన్స్.. మీరు పిల్లలురా అంటున్న తమన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
 

Trending News