Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 నుంచి నాగ్ అవుట్.. ఆ ఇద్దరి హీరోలలో ఒకరు ఫిక్స్?

Bigg Boss Updates: బిగ్ బాస్ ఆరవ సీజన్ నుంచి తెలుగు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున తరువాతి సీజన్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది, తన స్థానంలో మరో హీరోని ఆయన రికమెండ్ చేశారని అంటున్నారు. ఆ వివరాలు   

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 19, 2022, 09:45 AM IST
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 నుంచి నాగ్ అవుట్.. ఆ ఇద్దరి హీరోలలో ఒకరు ఫిక్స్?

Nagarjuna Out From Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ కి ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో విదేశాల్లో బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ షో సంప్రదాయం అనేక భాషల్లో కొనసాగుతోంది. తెలుగులో కూడా 2017 వ సంవత్సరంలో ఈ షోల పరంపరను తీసుకువచ్చారు. మొదటి సీజన్ ని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా రెండో సీజన్ ని హీరో నాని హోస్ట్ చేశారు, ఆ తర్వాత నుంచి వరుసగా నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్నారు.

వరుసగా మూడో సీజన్ నుంచే నాగార్జున ఈ బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అలా సీజన్ 6 నిన్నటితో పూర్తయింది. ఇక వచ్చే ఏడాది సీజన్ సెవెన్ జరగబోతోంది. అయితే ఈ సీజన్ సెవెన్ కి సంబంధించి ఒక హాట్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదేమిటంటే నాగార్జున బిగ్ బాస్ సెవెన్ హోస్ట్ గా ఉండడం లేదని, ఆయన హోస్ట్ స్థానం నుంచి తప్పుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఆయన స్థానంలో మరో స్టార్ హీరో హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ముందుగా బాలకృష్ణ పేరు అయితే ఈ విషయంలో తెర మీదకు వచ్చింది. ఆన్ స్టాప్ బుల్ విత్ ఎన్బికె షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన బాలకృష్ణ ఈ బిగ్ బాస్ సీజన్ 7 షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు బిగ్ బాస్ సెవెన్ హోస్ట్గా రానా దగ్గుబాటి వ్యవహరించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. రానా దగ్గుబాటి పేరుని నాగార్జున రికమెండ్ చేశారని తెలుస్తోంది.

రానా అనారోగ్య పరిస్థితుల రీత్యా ఒక సర్జరీ చేయించుకున్నారు. దీంతో కొన్నాళ్లపాటు సినిమా షూటింగులకు దూరంగా ఉండమని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఫైట్లు, డాన్సులు చేయకుండా సినిమాలు చేయడం కష్టమే కాబట్టి కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగా ఉండాలని రానా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.

అయితే పూర్తిగా సినిమాలు చేయకపోతే ప్రేక్షకులకు తనకు కనెక్షన్ దూరమైతుందని బాధపడుతున్న రానాకు మోరల్ సపోర్ట్ గా నిలిచేందుకు ఆయన పేరుని నాగార్జున రెకమెండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ఎవరి పేరు ఎవరు రికమెండ్ చేసినా ఫైనల్ డెసిషన్ మాత్రం స్టార్ మా యాజమాన్యం, ఎండోమోల్ షైన్  గ్రూపుది అని మాత్రం చెప్పక తప్పదు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది. 

Also Read: Mrunal Thakur Hot Photos: జిగేల్ మనిపిస్తున్న సీత.. కనిపించీ కనిపించకుండా అందాల విందు!

Also Read: Bigg Boss 6 Telugu Winner : గెలిచినా ఓడినట్టు చేసిన నాగార్జున.. రేవంత్‌కు క్షణాల్లో ఆనందం ఆవిరి.. ఓడినా గెలిచేసిన శ్రీహాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News