Vijay Devarakonda: ఇదేందయ్యా ఇదీ.. విజయ్ దేవరకొండ కటౌట్ ను ఆడుకుంటున్నారుగా!

Trolls on Vijay Devarakonda Cutout At Sudarshan Theatre: జూలై 21వ తేదీన  ట్రైలర్ ని విడుదల నేపథ్యంలో  సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ ఒక చెడ్డీ మీద ఉన్న కటౌట్ ని ఫాన్స్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్ మీద ఫన్నీ మీమ్స్ ట్రోల్స్ వస్తున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 20, 2022, 03:26 PM IST
  • లైగర్ మూవీ ట్రైలర్ రిలీజ్ కు రంగం సిద్దం
  • ఆసక్తికరంగా విజయ్ దేవరకొండ కటౌట్
  • ఆసక్తికర చర్చలు మొదలు
Vijay Devarakonda: ఇదేందయ్యా ఇదీ.. విజయ్ దేవరకొండ కటౌట్ ను ఆడుకుంటున్నారుగా!

Trolls on Vijay Devarakonda Cutout At Sudarshan Theatre: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన చిత్రం లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనే ఉప శీర్షికతో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. ముంబై స్లమ్ లో పెరిగిన ఒక సాదాసీదా వ్యక్తి అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల వరకు ఎలా వెళ్లి చాంపియన్గా నిలిచాడు అనే లైన్ తో ఈ సినిమాను రూపొందించారు.

ఈ సినిమాలో రమ్యకృష్ణ అదే విధంగా మైక్ టైసన్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరియర్లో మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి సినిమా ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభించింది సినిమా యూనిట్.  జూలై 21వ తేదీన అన్ని భాషలలోనూ ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు.

దీనికి సంబంధించి ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్ద భారీ గ్రాండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం 6:30 గంటలకు ముంబైలోని అంధేరి సినీపోలీస్ థియేటర్లో మరో గ్రాండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సుదర్శన్ థియేటర్ వద్ద విజయ్ దేవరకొండ ఒక చెడ్డీ మీద ఉన్న కటౌట్ ని ఫాన్స్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కటౌట్ మీద ఫన్నీ మీమ్స్ ట్రోల్స్ వస్తున్నాయి.

ఇది విజయ్ దేవరకొండ లైగర్ యాడ్ లాగా లేదని ఏదో డ్రాయర్ యాడ్ కోసం హీరో కటౌట్ నిలబెట్టినట్లు కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కరణ్ జోహార్ చార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద నిర్మించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేయడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది.
Also Read: Ileana D'cruz: బికినీతో కాక రేపిన ఇలియానా డిక్రూజ్.. అందాలన్నీ కనిపించే విధంగా!

Also Read: Pawan Kalyan: తీవ్ర అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఆ నిర్వాకంతోనే?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News