Lobo Viral Interview: బిగ్‌బాస్‌కు దండంరా అయ్యా... ఇపుడదే షోలో కంటెస్టెంట్‌గా లోబో!

నిన్ననే ప్రారంభమైన బిగ్‌బాస్‌ షో పై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. కంటెస్టెంట్‌గా వచ్చిన లోబో ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక వీడియో ప్రస్తుతం ట్రోలింగ్ కు గురవుతుంది. అదేంటో మీరే చూసేయండి మరీ!  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2021, 06:10 PM IST
  • ట్రోలింగ్ అవుతన్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ లోబో వీడియో
  • నచ్చదని చెప్పి మళ్లీ అదే షో కి ఎలా వెల్లవని ట్రోలింగ్
  • వీడియో టాగ్ ఒక ఆటడుకుంటున్న నెటిజన్లు...
Lobo Viral Interview: బిగ్‌బాస్‌కు దండంరా అయ్యా... ఇపుడదే షోలో కంటెస్టెంట్‌గా లోబో!

Bigg Boss 5 Telugu: నిన్నటి నుండే బిగ్‌బాస్‌ షో (Bigg Boss 5 Telugu) మొదలైంది.. ఇంకేం ఉంది టన్నుల కొద్దీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు నాలుగు సీజన్ లు విజయవంతం అవగా తాజాగా 5 సీజన్ అన్నపూర్ణ స్టూడియోలో (Annapurna Studio) ప్రారంభమైంది. కంటెస్టెంట్‌ల డ్యాన్స్‌లు, ప్రమోలు, ఎడుపులతో స్టేజ్ మోత మోగిపోయింది. 

మొత్తం 19 మంది కంటెస్టెంట్‌లు నిన్న ఒకేసారి బిగ్‌బాస్‌ లోకి వెళ్లగా.. మొదటి రోజు నుండే బిగ్‌బాస్‌ టాస్క్ లతో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్  చేసారు. ఇదిలా ఉండగా... బిగ్‌బాస్‌ షో కంటెస్టెంట్‌లలో (Bigg Boss Telugu 5 contestants 2021) ఒకరైన లోబో (Lobo).. మా టీవీ ద్వారానే కెరీర్ ప్రారంభించినట్టు మరియు మళ్లీ అదే ఛానెల్ లో ప్రారంభమయ్యే బిగ్‌బాస్‌లో పాల్గొనటం సంతోషంగా ఉందని తెలిపారు. 

Also Read: Pooja Hegde: హాట్ ఫోటో షూట్ లతో అదరగొడుతున్న బుట్ట బొమ్మ..

కానీ ఇపుడు లోబో ఇంటర్వ్యూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే...  ఇంటర్వ్యూలో వీడియోలో యాంకర్ (Telugu Anchor) లోబో ని బిగ్ బాస్ షో చూస్తుంటారా అని అడిగింది దానికి లోబో "బిగ్‌బాస్‌ షోకు ఓ దండంఅయ్యా . అది నా టేస్ట్‌ కాదు. షోలో చాన్స్‌ రావకపోడమే మంచిది. నాకు ఆ షో నచ్చదు" అని లోబో (Lobo) అన్నారు. ఇపుడు ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతుంది. 

దీంతో.. ఇది వరకు అలా అనటం.. ఇపుడు అదే షో లో పాల్గొనటం.. ఏంటి అని నెటిజన్లు తెగ ఆడేసుకున్తున్నారు. ఛాన్స్ లేనపుడు ఒకలా... ఇపుడు మరోలా మాట్లాడుతున్నాడని ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. కట్టు బొట్టు డిఫెరెంట్ గా పక్క లోకల్ హైదరాబాదీ యాస (Hyderabad Slang) లో మాట్లాడే లోబో ఈ షో లో ఎంత వరకు నేగ్గుకవస్తాడో చూడాలి మరి!  బిగ్‌బాస్‌ షో 5 సీజన్ కూడా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హోస్ట్ చేస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. 

Also Read: Vijay Sethupathi: బేబమ్మతో సినిమా చేయలేనంటున్న విజయ్‌ సేతుపతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News