Guntur Kaaram: గుంటూరుకారం కథ ఇదేనా.. మరోసారీ నవలను కాపీకొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్?

Trivikram Srinivas: తెలుగు ప్రేక్షకులకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సినిమాలకు.. డైలాగ్స్ కు ఫిదా అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు.. కానీ అలాంటి త్రివిక్రమ్ పక్క వారి ఆలోచనలను కాపీ కొట్టడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2024, 11:38 AM IST
Guntur Kaaram: గుంటూరుకారం కథ ఇదేనా.. మరోసారీ నవలను కాపీకొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్?

Guntur Kaaram Story: మాటల మాంత్రికుడు గా ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకప్పుడు త్రివిక్రమ్ డైలాగ్స్ వల్లే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి అన్నడంల సందేహం లేదు. స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి ఇలాంటి సినిమాలకు మాటలు అందించి ఆ చిత్రాలను సూపర్ హిట్ గా నిలిపారు. నువ్వే.. నువ్వే సినిమాతో డైరెక్టర్ గా మారి మొదటి చిత్రంతోనే మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఆ తరువాత వచ్చిన అతడు చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ సూపర్ హిట్ కూడా అందించారు ఈ దర్శకుడు.

కానీ అలాంటి త్రివిక్రమ్ పక్క వారి ఆలోచనలను కాపీ కొడుతూ తీసిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి.  అతని చిత్రం "అ ఆ" విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన కృష్ణా సినిమా 'మీనా' నుండి కాపీ కొట్టిన చిత్రమని అప్పట్లో ప్రచారం సాగింది. మీనా చిత్రం యద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా రూపొందించబడింది. కాగా ఈ నవల చదివిన వారికి కానీ..మీనా సినిమా చూసిన వారికి కానీ.. త్రివిక్రమ్ వాటి నుంచి ఆ ఆ సినిమాను ఎంతగా కాపీ కొట్టారో తప్పక అర్థమవుతుంది. అంతే కాదు త్రివిక్రమ్ ఆ కథకు గాను సులోచన రాణి కి టైటిల్స్ లో క్రెడిట్ కూడా ఇవ్వలేదు. ఇదే విషయంపైన సులోచన రాణి అప్పట్లో కేసు పెట్టడం కూడా జరిగింది.

అలాగే పాత సినిమా "ఇంటి దొంగ"ని "అల వైకుంఠపురములో"గా మార్చాడు ఈ డైరెక్టర్.  ఈ సినిమా కమర్షియల్‌గా మంచి వసూళ్లను సాధించినప్పటికీ, ఆ సినిమా స్టోరీ త్రివిక్రమ్ సొంత ఐడియా కాదు అని అర్థమవుతుంది. 

ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో కూడా ఈ దర్శకుడు ఇదే ఫాలో అవుతున్నారని వినికిడి. మరోసారి సులోచనా రాణి నవలలను స్ఫూర్తిగా తీసుకుని త్రివిక్రమ్ 'గుంటూరు కారం' తీస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సులోచనా రాణి నవల 'కీర్తి కిరీటాలు' నుంచి 'గుంటూరు కారం' కథాంశాన్ని రూపొందించారని తెలుస్తోంది.  

ఆ నవల ఆధారంగా కథ ఇలా సాగుతుంది..  కొటిమందిలో - ఏ ఒక్కరికో, ఏ పూర్వ జన్మ పుణ్యం వల్లనో లభ్యమయ్యే అపురూపమైన గాత్రం రాజ్యలక్ష్మికి లభిస్తుంది. ఆమె సంగీత విద్య ఆమెకు కీర్తి కీరీటాలు తెచ్చి పెడుతుంది. అయితే ఆమె అదృష్టం అలా మెరిసి ఇలా మాయమైపోతుంది. ఒక సంగీత కళాకారిణి జీవితంలోని అపస్వరాలని ఆర్ధంగా చిత్రించే నవల కీర్తి కీరీటాలు. దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది. మరి ఈ నవల ఆధారంగా గుంటూరు కారం తెరకెక్కిస్తూ ఉంటే.. రాజ్యలక్ష్మి పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. ఆ  పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నట్టు కూడా టాక్ నడుస్తోంది.

మరో విషయం ఏమిటి అంటే ప్రస్తుతం సులోచన రాణి గారు మరణించి కొద్ది రోజులు అవుతోంది. కాబట్టి ఇంకేం సమస్య లేదని టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వకుండా త్రివిక్రమ్ కాపీ కొట్టారా.. లేకపోతే ఈసారి అన్న టైటిల్స్ లో క్రెడిట్ ఇస్తారా చూడాల్సి ఉంది. కానీ దీంట్లో ఉన్న నిజం ఇంకా అధికారికంగా ఎవరికీ తెలియదు కాబట్టి దీనిపైన క్లారిటీ రావాలి అంటే గుంటూరు కారం రిలీజ్ డేట్ జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read: Oppo Reno 11 Series: శక్తివంతమైన 50MP కెమెరాతో మార్కెట్‌లోకి Oppo Reno 11, Reno 11 Pro మొబైల్స్‌..విడుదల తేది అప్పుడే..

Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News