NTR Devara: ‘దేవర’పై అదిరిపోయే అప్‌డేట్‌.. యాక్షన్ సన్నివేశాలు కంప్లీట్..

NTR Devara: ఎన్టీఆర్ దేవర సినిమాకు సంబంధించి భారీ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న రిలీజ్ కానుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2023, 04:48 PM IST
NTR Devara: ‘దేవర’పై అదిరిపోయే అప్‌డేట్‌.. యాక్షన్ సన్నివేశాలు కంప్లీట్..

NTR Devara Movie Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR), దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ‘దేవర’ (Devara). ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మూవీ రేంజ్ ఎలా ఉండబోతుందో తెలిపింది. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది దేవర యూనిట్. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను షేర్‌ చేసింది.

గత కొన్ని రోజులుగా దేవర’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగుతోంది. తాజాగా చిత్రయూనిట్ ఐదో షెడ్యూల్ ను పూర్తిచేసుకున్నట్లు తెలిపింది మూవీ టీమ్. మరో రెండు రోజుల్లో కొత్త షెడ్యూల్ ను మెదలుపెట్టనున్నట్లు మేకర్స్ తెలిపారు. హాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ నేతృత్వంలో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను పంచుకుంది చిత్రబృందం. 

Also Read: Baby 2nd Day Collections: బాక్సాఫీస్ వద్ద 'బేబీ' బీభత్సం.. రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే?

దేవర సినిమాకు సంబంధించి మరో వార్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో  అల్లు అర్హ (allu arha) ఓ కీలకపాత్రలో నటించనుందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే శాకుంతలం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది అర్హ. మరోవైపు ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ నటిస్తోంది. ఇందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (saif alikhan) నటించనున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Nithya Menen: నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం.. శకం ముగిసిందంటూ ఎమోషనల్ పోస్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News