Karthikeya 2: బ్లాక్‌బస్టర్ మూవీ కార్తికేయ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడు, ఎందులో

Karthikeya 2: ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న కార్తికేయ-2 ఇప్పుడు ఓటీటీ విడుదల డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఎప్పుడు స్ట్రీమ్ అవనుందో ఖరారైంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 26, 2022, 10:06 PM IST
Karthikeya 2: బ్లాక్‌బస్టర్ మూవీ కార్తికేయ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడు, ఎందులో

Karthikeya 2: ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న కార్తికేయ-2 ఇప్పుడు ఓటీటీ విడుదల డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఎప్పుడు స్ట్రీమ్ అవనుందో ఖరారైంది.

ఆగస్టు 13వ తేదీన ధియేటర్లలో విడుదలైన నిఖిల్ హీరోగా కన్పించిన కార్తికేయ-2 సూపర్ హిట్ మూవీగా పేరు తెచ్చుకుంది. థియేటర్లలో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఆగస్టు 13 నుంటి ఇప్పటి వరకూ కార్తికేయ-2 సినిమా 120 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. 

ఇప్పుడు కార్తికేయ-2 సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్దమైంది. అక్టోబర్ 5న ప్రముఖ ఓటీటీ వేదికైన జీ5లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. జీ5 నుంచి అధికారికంగా ప్రకటన లేకపోయినా..సోషల్ మీడియాలో హీరో నిఖిల్ పోస్ట్ చేయడంతో అక్టోబర్ 5 ఓటీటీ విడుదల తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ఉత్తరాది ప్రేక్షకుల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. 

జీ5లో కార్తికేయ-2 స్ట్రీమింగ్ విషయంలో గతంలో చాలాసార్లు వార్తలు వచ్చినా అధికారికంగా ప్రకటన రాలేదు. ఇప్పుడు కూడా జీ5 అధికారికంగా వెల్లడించకపోయినా..అక్టోబర్ 5న జీ5లో కార్తికేయ-2 స్ట్రీమింగ్ అంటూ వస్తున్న వార్తల్ని హీరో నిఖిల్ లైక్ చేయడంతో దాదాపుగా ఖరారైనట్టేనని తెలుస్తోంది. 

Also read: Malavika Mohanan Pics: హాఫ్ శారీలో మెరిసిపోతున్న మాళవిక మోహనన్.. మలయాళ బ్యూటీని ఇలా ఎప్పుడూ చూసుండరు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News