Srivass Mother Died: ‘డిక్టేటర్’ డైరెక్టర్ ఇంట్లో విషాదం

నటసింహం నందమూరి బాలకృష్ణతో డిక్టేటర్ మూవీ తెరకెక్కించి హిట్ అందించిన దర్శకుడు శ్రీవాస్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 23, 2020, 09:33 AM IST
Srivass Mother Died: ‘డిక్టేటర్’ డైరెక్టర్ ఇంట్లో విషాదం

రాజమండ్రి: టాలీవుడ్ దర్శకుడు శ్రీవాస్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీవాస్ తల్లి ఓలేటి అమ్మాజీ(68) ఫిబ్రవరి 22న (శనివారం నాడు) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అమ్మాజీ పరిస్థితి విషమించడంతో తూర్పుగోదావరి జిల్లాలోని స్వగ్రామమైన పురుషోత్తపట్నంలో తుదిశ్వాస విడిచారు. డైరెక్టర్ శ్రీవాస్ తల్లి మరణంపై టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. శ్రీవాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమ్మాజీకి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. డైరెక్టర్ శ్రీవాస్‌ అమ్మాజికి రెండో సంతానం.

Also Read: గన్ మిస్‌ఫైర్: కానిస్టేబుల్‌ తలలోకి దూసుకెళ్లిన తూటా

See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా

కాగా, ‘లక్ష్యం’ సినిమాతో యాక్షన్ మూవీ డైరెక్టర్‌గా తెలుగు సినిమా పరిశ్రమకు శ్రీవాస్ పరిచయమైన విషయం తెలిసిందే. రామ రామ కృష్ణ కృష్ణ, లౌక్యం సినిమాలు తెరకెక్కించారు. నందమూరి బాలకృష్ణకు డిక్టేటర్ మూవీతో హిట్ ఇచ్చారు. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా ‘సాక్ష్యం’. అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు డీవీవీ కళ్యాణ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసే సినిమా పనిలో శ్రీవాస్ బిజీగా ఉన్నారు.

See Pics: అందాల గేట్లు ఎత్తేసిన భామలు 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News