Rangasthalam 2 : రంగస్థలం 2లో హీరో ఎవరు ? కథ ఏంటి ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సాధించిన విజయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన లెక్కల మాస్టారు ఆ రంగస్థలం సీక్వెల్ కు సిద్ధమౌతున్నారు. రంగస్థలం 2 లో హీరో ఎవరు..కధేంటో తెలుసా…

Last Updated : Nov 12, 2020, 03:07 PM IST
Rangasthalam 2 : రంగస్థలం 2లో  హీరో ఎవరు ? కథ ఏంటి ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram charan ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం ( Sukumar Direction )లో వచ్చిన రంగస్థలం సాధించిన విజయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన లెక్కల మాస్టారు ఆ రంగస్థలం సీక్వెల్ కు సిద్ధమౌతున్నారు. రంగస్థలం 2 లో హీరో ఎవరు..కధేంటో తెలుసా…

2017లో విడుదలైన రంగస్థలం ( Rangasthalam ) తెలుగు సినీ పరిశ్రమ ( Telugu Cinema Industry )లో ఓ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కధ గానీ, కధనం గాానీ..పాటలు గానీ, రామ్ చరణ్ నటన గానీ అద్భుతంగా ఉన్నాయి. ఇక సుకుమార్ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ క్యాలిక్యులేటెడ్ గా ఉంటాయి.  మగధీర హిట్ తరువాత ఆ స్థాయిలో హిటైన రామ్ చరణ్ సినిమా ఇదే. 

ఓ వైపు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, మరోవైపు రామ్ చరణ్ నటనపై అంతర్జాతీయంగా వచ్చిన ప్రశంసలు, సమంత అద్భుత నటన...ఒకటేంటి సినిమాలో అన్నీ చక్కగా సమకూరాయి. అందుకే అంతటి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఏకంగా 18 అవార్డుల్ని సాధించింది. అటు దర్శకుడు సుకుమార్ కు కూడా చాలా క్రేజ్ వచ్చింది. ఆర్య ( Aarya ) హిట్ తరువాత అంతటి హిట్ సుకుమార్ కు కూాడా రాలేదనే చెప్పాలి. బహుశా అందుకే ఆర్య సీక్వెల్ చేసిన సుకుమార్ ఇప్పుడు రంగస్థలం సీక్వెల్ కు సిద్ధమౌతున్నాడు. ఇప్పటికే ప్రణాళికను కూడా సుకుమార్ సిద్దం చేసుకన్నాడట.

రంగస్థలం 2 ఎలా ఉంటుంది..హీరో ఎవరు

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త ( Rangammattha character ) అనసూయ ఊరికి ప్రెసిడెంట్ అవుతుంది. ఆమె పాత్ర కూడా అక్కడితో ముగుస్తుంది. ఇప్పుడు రంగస్థలం 2లో రంగమ్మత్త  ఊరి ప్రెసిడెంట్ అయిన తరువాత నుంచి కధ ప్రారంభం కానుందని సమాాచారం. స్టోరీని అక్కడి నుంచి సుకుమార్ కంటిన్యూ చేస్తున్నాడట. దాదాపుగా డ్రాఫ్ట్ స్టోరీ సిద్ధం చేసి...రేపో మాపో రామ్ చరణ్ కు విన్పించేందుకు సుకుమార్ సిద్ధమౌతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉండటంతో రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి చెప్పలేదు. 

అయితే ఈలోగా అంటే ఆర్ఆర్ఆర్ ( RRR Movie ) పూర్తయ్యేలోగా..రామ్ చరణ్ కు రంగస్థలం 2 కథను విన్పించి ఒప్పించినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రంగస్థలంతో విజయపు కిక్ అందించింది సుకుమారే కాబట్టి.  ఆర్య సీక్వెల్ ( Aarya Sequel ) సాధించిన విజయం కంటే భారీ విజయాన్ని రంగస్థలం 2 సాధిస్తుందనే నమ్మకం సుకుమార్ కు గట్టిగానే ఉందట. Also read: Gamanam Movie: ‘గమనం’ ట్రైలర్‌ విడుదల చేసిన పవన్ కల్యాణ్

Trending News