Drugs Case in Tollywood: గత కొంతకాలంగా డ్రగ్స్ కేస్ వ్యవహారాలు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో చాలామంది హీరోలు, నటులు, డైరెక్టర్లు, నిర్మాతల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి... కానీ ఈ మధ్య కొరియోగ్రాఫర్ల పేరు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలా ఇప్పుడు మరొకసారి టాలీవుడ్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలాన్ని సృష్టిస్తోంది.
హైదరాబాద్లోని మాదాపూర్ లో జరిగిన ఒక హోటల్లో ఓయో రూంలో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో.. అక్కడికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మద్యం సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వారిని పోలీసులు పట్టుకున్నారు అయితే ఈ పార్టీలో టాలీవుడ్ కి చెందిన ఒక కొరియోగ్రాఫర్ కన్హా మహంతి.. చిక్కడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. అలాగే వీరితోపాటు ప్రముఖ ఆర్కిటెక్టర్ అయినటువంటి ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగిందట.
ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో పాల్గొన్నటువంటి కొరియోగ్రాఫర్ కన్హా మహంతి నీ పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బుల్లితెర పైన సూపర్ హిట్గా నిలిచిన ఢీ షోలో కూడా చాలా కాలం నుంచి పనిచేస్తున్నారట కొరియోగ్రాఫర్ మహంతి..
హైదరాబాద్ నుంచి డ్రగ్ తీసుకుంటే అనుమానం వస్తుందని భావించిన వీరు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి మరి ఇక్కడ పార్టీ చేసుకున్నారట. దుండగులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కదిరి హోటల్ పై రైడ్ నిర్వహించినట్లు సమాచారం. ప్రియాంక రెడ్డి,మహంతి తో పాటు మరొక నలుగురిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది మాదాపూర్ పోలీసులు..
అయితే అక్కడ చిక్కిన వాటిలో MDMA డ్రగ్స్ తో పాటుగా మరో రెండు రకాల డ్రగ్స్ ను సైతం స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. నిందితులను సైతం వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారట .ఈ డ్రగ్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఎలా వచ్చింది? వీటి వెనక ఎవరెవరి హస్తం ఉందని విషయంపై విచారిస్తున్నారట.
Also Read: RS Praveen Kumar: 'కొండా సురేఖకు మతిస్థిమితం లేదు.. ఆమె నేర చరిత్ర వరంగల్ ప్రజలకు తెలుసు'
Also Read: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter