Naresh comments on Mohan Babu: టాలీవుడ్ హాట్ టాపిక్.. ఇండస్ట్రీ పెద్ద మోహన్ బాబే : క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్

Naresh Comments on Manchu Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీకి మోహన్‌ బాబే పెద్దన్న అంటూ నరేష్ చేసిన కామెంట్స్‌.. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  మోహన్ బాబుకు ఎవరూ సాటిలేరు అంటూ ఆయన పొడిగిన తీరుపై టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 15, 2022, 02:58 PM IST
  • మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు మొదలైప్పటి నుంచి
    ఒకటే చర్చ
  • సినీ ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయంపై జోరుగా డిస్కషన్
  • తాజాగా మళ్లీ తెరపైకి వచ్చిన అంశం
  • క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం
Naresh comments on Mohan Babu: టాలీవుడ్ హాట్ టాపిక్.. ఇండస్ట్రీ పెద్ద మోహన్ బాబే : క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్

Tollywood Movie Tickets Price issue: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు మొదలైప్పటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే అంశంపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయంపై చాలా రోజులుగా డిస్కషన్ నడుస్తోంది. కాగా మా ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు గెలవడంతో ఈ అంశం తర్వాత పెద్దగా చర్చకు రాలేదు. 

అయితే ఇప్పుడు మళ్లీ ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొన్ని రోజుల క్రితం మోహన్‌ బాబు మూవీ సన్నాఫ్‌ ఇండియా ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమంలో నరేష్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీకి పెద్దన్న మోహన్‌ బాబే అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దన్న.... మా అందరికీ అన్నయ్య అంటూ మోహన్‌బాబును పొగడ్తలతో ముంచెత్తారు. మోహన్‌ బాబు అందరికంటే మిన్న అని పేర్కొన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప హీరోలు.. గొప్ప గొప్ప విలన్లు.. క్యారెక్టర్‌‌ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారని.. కానీ అన్నీ కలిసినటువంటి ఒకే ఒక్క మనిషి మోహన్ బాబు అంటూ కొనియాడారు. మోహన్ బాబు సాటిలేరు ఎవరూ అంటూ ఆయన పొడిగారు.

మోహన్ బాబు సినిమా కోసం బతికే మనిషి కాదు.. ఆయన సినిమా కోసమే పుట్టిన మనిషి అని నరేష్‌ అన్నారు. అయితే నరేష్‌ కామెంట్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Also Read: Hijab Controversy: హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా సంచలన కామెంట్స్ 

Also Read: Ghani Release Date: వరుణ్ తేజ్ 'గని' రిలీజ్ డేట్ వచ్చేసింది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News