Samantha: ఛాలెంజింగ్ నెగెటివ్ పాత్రలో కన్పించనున్న సమంత

Samantha: టాలీవుడ్ నటి సమంతకు విడాకుల తరువాత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప ఐటెమ్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్న సమంత ఇప్పుడు నెగెటివ్ రోల్ పోషించనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2022, 01:54 PM IST
 Samantha: ఛాలెంజింగ్ నెగెటివ్ పాత్రలో కన్పించనున్న సమంత

Samantha: టాలీవుడ్ నటి సమంతకు విడాకుల తరువాత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప ఐటెమ్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్న సమంత ఇప్పుడు నెగెటివ్ రోల్ పోషించనుంది.

అందంతో పాటు అభినయం కలిగిన సమంతా ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా పాటతో ఉర్రూతలూగించిన సమంతా..అదే పాటతో ఉత్తరాదిని దున్నేస్తోంది. ఉత్తరాది అభిమానుల్లో సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ 2 హిందీ వెబ్‌సిరీస్, తరువాత సామ్ సిరీస్‌తో నటనకు పదునుపెట్టింది. ఇక నుంచి నటకు ప్రాధాన్యత కలిగిన ఛాలెంజింగ్ పాత్రల్ని పోషిస్తానని చెప్పిన సమంతా (Samantha)..అందుకు తగ్గ రోల్స్ ఎంపిక చేసుకుంటోంది. తాజాగా హాలీవుడ్ మూవీ అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్‌లో బై సెక్సువల్ పాత్రను ఎంచుకుంది.

ఇప్పుడు తాజాగా మరో ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా నెగెటివ్ రోల్‌లో. విజయ్ సేతుపతి, నయనతార కలిసి నటిస్తున్న కాత్తువాక్కుల రెండు కాదల్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఖతీజా పాత్రను పోషిస్తోందని సమాచారం. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతా నటన అద్భుతంగా ఉందని ఇప్పటికే కోలీవుడ్‌లో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారల ప్రేమకు అడ్డుపడి..విలనిజంతో స్టోరీని మలుపు తిప్పనుందట. ఈ నెగెటివ్ రోల్ ( Samantha in Negative Role) పాత్రపై సమంతా అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. 

Also read: Esha Gupta Photos: అర్థనగ్నంగా రామ్ చరణ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News