Liger Movie Promotion: విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదుగా..అహ్మదాబాద్‌లో విజయ్‌ను చుట్టేసిన అమ్మాయిలు

Liger Movie Promotion: టాలీవుడ్ , పాన్ ఇండియా హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. లైగర్ సినిమా ప్రొమోషన్‌లో విజయ్‌ను చూసేందుకు అమ్మాయిలు ఎగబడిపోయారు. పక్కనే ఉన్న అనన్యా పాండేను పట్టించుకోలేదు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 8, 2022, 11:20 PM IST
Liger Movie Promotion: విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదుగా..అహ్మదాబాద్‌లో విజయ్‌ను చుట్టేసిన అమ్మాయిలు

Liger Movie Promotion: టాలీవుడ్ , పాన్ ఇండియా హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. లైగర్ సినిమా ప్రొమోషన్‌లో విజయ్‌ను చూసేందుకు అమ్మాయిలు ఎగబడిపోయారు. పక్కనే ఉన్న అనన్యా పాండేను పట్టించుకోలేదు..

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ నటి అనన్యా పాండే నటించిన లైగర్ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొమోషన్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. లైగర్ సినిమా ప్రొమోషన్‌లో భాగంగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండను అమ్మాయిలు ఒక్కసారిగా చుట్టేశారు. అదే సమయంలో విజయ్ పక్కనే..సహ నటి అనన్యా పాండే ఉన్నా సరే..పట్టించుకోకపోవడం విశేషం. అదీ విజయ్ దేవరకొండకు అమ్మాయిల్లో ఉన్న క్రేజ్. 

విజయ్ దేవరకొండ, అనన్యా పాండేలు లైగర్ సినిమా ప్రొమోషన్ కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో ఈ పర్యటనలో అర్ధమౌతోంది. ఎక్కడికి వెళ్లినా..జనం చుట్టేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలైతే పడి ఛస్తున్నారు. అదే విధంగా ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండను అమ్మాయిలు ఒక్కసారిగా చుట్టేశారు. విజయ్, అనన్యాలకు భారీ పూలదండలతో సత్కరించిన తరువాత..విజయ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఉత్సాహం చూపించారు. పక్కనే అనన్యా పాండే ఉన్నా..ఎవరూ పట్టించుకోకపోవడంతో పాపం..అనన్యా కాస్త నిరాశకు లోనైంది.

సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ, అనన్యా పాండేలు ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా అమ్మాయిలు విజయ్‌ను చుట్టేయడం, మాట్లాడేందుకు ప్రయత్నించడం, పక్కనే ఉన్న అనన్యాను పట్టించుకోకపోవడం అంతా వీడియోలో స్పష్టంగా కన్పిస్తుంది. మరోవైపు లైగర్ జిందాబాద్ , విజయ్ జిందాబాద్ స్లోగన్లు కూడా గట్టిగానే విన్పించాయి.

లైగర్ సినిమా ప్రొమోషన్ దేశమంతా జరుగుతోంది. ముంబై, ఉత్తరాదినే కాకుండా..దక్షిణాదిన కూడా ప్రొమోషన్ నడుస్తోంది. ఆగస్టు 25వ తేదీన విడుదల కానున్న లైగర్ సినిమా వివిధ భాషల్లో విడుదలవుతోంది. ఇటీవల సినిమా ప్రొమోషన్ కోసం అహ్మాదాబాద్ చేరుకుంది లైగర్ సినిమా యూనిట్. ఈ వీడియో కూడా అక్కడిదేనని తెలుస్తోంది. 

Also read: Alia Bhatt: అలియా భట్ ఒక్క పోస్ట్ పెడితే అంత డబ్బా.. షాకింగ్ గా ఇన్స్టాగ్రామ్ ఆదాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News