Saindhav Movie: ఇవాళ బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్న సైంధవ్ టీం

Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ నయా చిత్రం సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీటీమ్ ఇవాళ బిగ్ అప్ డేట్ ను ఇవ్వనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2023, 12:12 PM IST
Saindhav Movie: ఇవాళ బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వనున్న సైంధవ్ టీం

Saindhav Movie Update: విక్టరీ వెంకటేష్(Daggubati Venkatesh) నటిస్తున్న 75వ చిత్రం 'సైంధవ్' (Saindhav). శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ రాబోతుంది. ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల 5 నిమిషాల‌కు ఓ అదిరిపోయే సస్పెన్స్‌ ఇవ్వబోతున్నట్లు శైలేష్ టీం ప్రకటించింది. ఈ సాయంత్రం సైంధవ్ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తుందోనని మూవీ లవర్స్ తెగ ఆలోచిస్తున్నారు. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. సైంధవ్‌లో వెంకీకి జోడిగా జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తోంది. ఇందులో రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్‌ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా 2024 జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: Aadikeshava: ఆదికేశవ నుంచి ‘'హే బుజ్జి బంగారం’' సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్ తో ఇరగదీసిన వైష్ణవ్, శ్రీలీల..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News