Tiger Nageswara Rao: రవితేజ కి పెద్ద షాక్ ఇచ్చిన బాలీవుడ్..

Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా తెలుగులో మొదటి రోజు నుంచి మంచి టాక్ ను అందుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు సాగుతూ ఉండగా హిందీలో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు అంత ఆశాజనకంగా లేకపోవడం అభిమానులను నిరాశ కు గురిచేస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2023, 12:30 PM IST
Tiger Nageswara Rao: రవితేజ కి పెద్ద షాక్ ఇచ్చిన బాలీవుడ్..

Ravi Teja:

స్టువర్టుపురంలో ఒకప్పటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొట్టమొదటి రవితేజ కరీర్ లో మొట్టమొదటి ప్యాన్ ఇండియా చిత్రంగా విడుదలైంది. తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా అక్టోబర్ 20న మంచి అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది.

ఈ సినిమా కోసం రవితేజ తో పాటు చిత్ర బృందం కూడా భారీ స్థాయిలో ప్రమోషన్లు చేశారు. తెలుగు లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ హిందీలో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు అంతంత మాత్రం గానే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం హిందీలో కూడా సినిమా ప్రమోషన్స్ మీద బాగానే దృష్టి పెట్టింది. ఇక కథలో కూడా నార్త్ ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉందని అందుకే హిందీలో కూడా సినిమా హిట్ అయ్యే అవకాశం ఉందని వారు అనుకున్నారు.

కానీ చిత్ర బృందం ఏమాత్రం ఊహించినటువంటి విధంగా సినిమాకి అతి తక్కువ కలెక్షన్లు వచ్చాయి. దీంతో చిత్రం బృందం తీవ్ర స్థాయిలో నిరాశ చెందుతుంది. తెలుగులో రవితేజ కి ఉన్న క్రేజ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకి వస్తున్నారు. కానీ మిగతా భాషల్లో మాత్రం ప్రేక్షకులు సినిమాను థియేటర్లో చూడటానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో కలెక్షన్లు కూడా భారీగా తగ్గిపోతూ వస్తున్నాయి.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించారు. రేణు దేశాయి, జిషు సేన్ గుప్తా, మురళి శర్మ, తదితరులు కీలక పాత్రలలో కనిపించిన ఈ సినిమాలో గాయత్రీ భరద్వాజ్, నుపుర్ సనన్ లు హీరోయిన్లుగా నటించారు. హిందీ లో కూడా చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషన్లను చేశారు. తెలుగులో కూడా చిత్ర బృందం ప్రమోషన్లపై బాగానే ఖర్చు పెట్టారు. తన మిగతా సినిమాలతో పోలిస్తే రవితేజ కూడా ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డారు. ఇక ప్రమోషన్లలో కూడా చాలా ఆసక్తిగా పాల్గొన్నారు. 

ఈ నేపథ్యంలోనే సినిమా తెలుగులో మంచి విజయాన్ని సాధించగలిగింది. తాజా సమాచారం ప్రకారం తెలుగు లో ఈ సినిమా ఇంకా 36 కోట్ల కలెక్షన్లు అందుకుంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకున్నట్టే. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హిందీలో ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారు విడుదల చేశారు.

Also Read: Karampudi Man Death News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. భార్య బిడ్డకు జన్మనిచ్చిన ఆసుపత్రికే భర్త మృతదేహం

Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News