Allu Aravind & Balaiah: అల్లు అరవింద్-బాలయ్యలది ఫెవికాల్ బంధం మరి..ఆహా వేదికపై బాలకృష్ణ

Allu Aravind & Balaiah: అన్‌స్టాపెబుల్ బాలయ్యతో ప్రారంభమైన ఆ బంధం కొనసాగుతోంది. బిజీ బాలయ్య..మరోసారి ఆహా ఓటీటీ వేదికపై ప్రత్యక్షమయ్యాడు. అన్‌స్టాపెబుల్ మళ్లీ ప్రారంభం కానుందా అనే సందేహాలు వస్తున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2022, 08:16 PM IST
Allu Aravind & Balaiah: అల్లు అరవింద్-బాలయ్యలది ఫెవికాల్ బంధం మరి..ఆహా వేదికపై బాలకృష్ణ

Allu Aravind & Balaiah: అన్‌స్టాపెబుల్ బాలయ్యతో ప్రారంభమైన ఆ బంధం కొనసాగుతోంది. బిజీ బాలయ్య..మరోసారి ఆహా ఓటీటీ వేదికపై ప్రత్యక్షమయ్యాడు. అన్‌స్టాపెబుల్ మళ్లీ ప్రారంభం కానుందా అనే సందేహాలు వస్తున్నాయి.

టాలీవుడ్ నిర్మాత , ఆహా ఓటీటీ యజమాని అల్లు అరవింద్‌తో బాలకృష్ణ బంధం ఇంకా కొనసాగుతోంది. ఆహాలో ప్రసారమై..అందర్నీ అలరించిన అన్‌స్టాపెబుల్ బాలయ్య మళ్లీ ప్రారంభం కానుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అన్‌స్టాపెబుల్ బాలయ్య షో..ఆహా ఓటీటీలో అద్భుత విజయం సాధించింది. అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ షోతో ప్రారంభమైన అల్లు అరవింద్, బాలయ్య బంధం ఇంకా కొనసాగుతున్నట్టు కన్పిస్తోంది. 

ఆహాలో ప్రసారమౌతున్న తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో బాలకృష్ణ బిజీ షెడ్యూల్ పక్కనబెట్టి మరీ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా డ్యాన్స్ ప్రదర్శన కూడా ఇచ్చారు. తెలుగు ఇండియన్ ఐడల్ సెమీఫైనల్స్ ఎపిసోడ్‌లో బాలకృష్ణ ప్రదర్శన హైలైట్ కానుంది. వాస్తవానికి ఇతర ఈవెంట్లకు బాలకృష్ణ దూరంగా ఉంటాడు. కానీ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌లో మాత్రం తరచూ పాల్గొంటున్నాుడు. ఇదంతా కేవలం అల్లు అరవింద్‌తో అతనికున్న సాన్నిహిత్యం ఫలితమే. బాలకృష్ణ-అల్లు అరవింద్ బంధం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 

Also read: VJ Sunny Unstoppable: బాలయ్య బాబు టైటిల్‌తో.. బిగ్‌బాస్ విజేత 'వీజే సన్నీ' కొత్త సినిమా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News