Sirivennala Last Song: 'శ్యామ్ సింగ రాయ్' నుంచి అదిరిపోయే అప్డేట్...'సిరివెన్నెల' రాసిన చివరి సాంగ్ రిలీజ్...

Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్' నుంచి మరో అప్ డేట్ వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాటను కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేసింది చిత్రబృందం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 04:39 PM IST
Sirivennala Last Song: 'శ్యామ్ సింగ రాయ్' నుంచి అదిరిపోయే అప్డేట్...'సిరివెన్నెల' రాసిన చివరి సాంగ్ రిలీజ్...

Shyam Singha Roy: నేచరల్ స్టార్ నాని హీరో(Hero Nani)గా నటిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' మూవీ(Shyam Singha Roy) నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్తి(Sirivennela Seetharama Sastry) రాసిన పాటను చిత్రయూనిట్ ఇవాళ విడుదల చేసింది. ఈ పాటలో సిరివెన్నెల మార్క్ మరోసారి కనిపిస్తోంది. ఈ సాంగ్ నాని, సాయిపల్లవి(Sai Pallavi)మధ్య ప్రేమకు ప్రతిరూపంగా ఉన్నట్లునిపిస్తోంది. ‘'సిరివెన్నెల'’పాటకు మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) క్లాస్ ట్యూన్ ఇచ్చారు.అనురాగ్ కులకర్ణి(Anurag Kulkarni) ఆలపించారు. సాంగ్ ప్రోమోను ఇది వరకే విడుదల చేశారు. పూర్తి సాంగ్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Also Read: RRR Movie Update: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో సర్‌ప్రైజ్‌..రామ్‌ టీజర్ ను రిలీజ్ చేసిన భీమ్..

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సాయి పల్లవి, కృతి శెట్టి(Krithi Shetty), మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చారు. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News