Vikram: 23 ఆపరేషన్లు.. ఏడ్చేసిన విక్రమ్ తల్లి.. ఇంతకీ ఏమైందంటే..!

Thangalaan Update: తంగలన్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి.. సిద్ధంగా ఉన్న విక్రమ్ వరుసగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో.. తన కాలేజీ రోజుల గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 7, 2024, 10:29 PM IST
Vikram: 23 ఆపరేషన్లు.. ఏడ్చేసిన విక్రమ్ తల్లి.. ఇంతకీ ఏమైందంటే..!

Thangalaan movie: చియాన్ విక్ర‌మ్ గురించి టాలీవుడ్ లో ప్రత్యేకించి ఇంట్రడక్షన్.. ఇవ్వాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ నటుడే అయినప్పటికీ దబింగ్ చిత్రాల ద్వారా.. తెలుగు ప్రేక్షకులకు ఇతను బాగా సుపరిచితుడే. విక్రమ్ తీసే సినిమాలలో కంటెంట్ తో పాటు.. పాత్రలు కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. అందుకే అతని సినిమాలకి తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఆదరింపు ఉంటుంది. కమలహాసన్.. తరువాత అంత గొప్ప నటన పట్టిమ కలిగిన వ్యక్తి విక్రమ్ అనడంలో.. ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగలిగే గొప్ప నటుడు విక్రమ్. 

అతను రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన.. పొన్నియిన్ సెల్వన్‌ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి తంగలన్ మూవీతో ప్రేక్షకులను.. పలకరించడానికి రెడీ అవుతున్నాడు. నటుడిగా ఒక్కొక్క మెట్టు.. పైకెక్కుతూ తనని తాను నిరూపించుకున్న విక్రమ్ తన కాలేజీ రోజుల గురించి ఓ ఇంటర్వ్యూలో.. చెప్పిన సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన కాలేజీ రోజుల గురించి మాట్లాడిన విక్రమ్.. తనకు నటన మీద ఆసక్తికి బీజం పడిన.. నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.’నాకు చిన్నప్పటి నుంచే నటుడుగా మారాలి అన్న కోరిక ఉండేది. ఎనిమిదవ తరగతి వరకు బాగా చదువుకునేవాడిని కానీ నటనపై ఆశ ఉండడంతో.. ఆ తర్వాత పెద్దగా చదవలేక పోయేవాడిని. ఎలాగో అదృష్టం కొద్ది పాస్ అయిపోతూ కాలేజీ.. వరకు వచ్చేసాను. కాలేజీ డేస్ లో నాటకాలలో నటించేటప్పుడు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. అయితే ఆ రోజే అనుకోకుండా నా కాలు విరిగింది.. దీంతో సుమారు సంవత్సరం పాటు మంచం మీదే గడిపేసాను’అని విక్రమ్ చెప్పుకొచ్చారు. 

విక్రమ్ కు కాలు విరిగిన తర్వాత.. అప్పటినుంచి ఇప్పటివరకు సుమారు 23 ఆపరేషన్లు జరిగాయట. అసలు నడవడు అనుకున్న.. విక్రమ్ నడుస్తాడు అని డాక్టర్ చెప్పినప్పుడు.. అతని తల్లి తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యి ఏడ్చేసారట. సుమారు 10 సంవత్సరాల పాటు ఆ సమస్యతో విక్రమ్ ఇబ్బంది పడ్డాడట. ఆ క్రమంలో అతను కుటుంబానికి అండగా నిలవడానికి 750 రూపాయల. జీతానికి పనిచేశాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు సినిమాలో నటించాలి అన్న ఆశ మాత్రం చచ్చిపోలేదు. తర్వాత మెల్లగా అవకాశాలు రావడంతో విక్రమ్ సినిమాల్లో.. తనని తాను నిరూపించుకుంటూ అంచలంచలుగా స్టార్ హీరో గా ఎదిగారు. ఇక విక్రమ్ ఆగస్టు 15న ప్రేక్షకులను తన 'తంగ‌లాన్’ చిత్రంతో పలకరించడానికి సిద్ధపడుతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Also Read: NTR - Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి ముహూర్తం ఖరారు.. ?

Also Read: Kamal Haasan: బిగ్‌బాస్‌కు అగ్ర హీరో బ్రేక్‌.. ఎందుకు.. ఏం జరిగిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News