Vijay LEO 2: విజయ్ సినిమా అంటే తమిళనాడులో క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. ఇటు తెలుగులో కూడా విజయ్ మార్కెట్ బాగానే ఉంది. గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన విజయ్ చిత్రం లియో.. అందరి ఊహలను తారుమారు చేస్తూ యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. ఈ తమిళ్ డబ్బింగ్ మూవీకి తెలుగులో విపరీతమైన క్రేజ్ రావడంతో భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. అయితే వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా వసూళ్లు..వీక్ డేస్ మొదలుకాగానే బాగా పడిపోయాయి.
లోకేష్ కనకరాజ్ నుంచి ఖైదీ ,విక్రమ్ లాంటి భారీ సక్సెస్ చిత్రాల తర్వాత వచ్చిన మూవీ కావడంతో లియో పై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. అయితే అందరూ ఆశించినట్లు కాకుండా.. లోకేష్ లియో చిత్రాన్ని చాలా పేలవంగా నడిపించి ప్రేక్షకులను నిరాశపరిచాడు. మూవీ విడుదలైన తర్వాత వెల్లువెత్తిన విమర్శలకు.. సమాధానంగా జరిగిన తప్పులను కూడా అతను అంగీకరించాడు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన సెకండ్ హాఫ్ కాస్త తేడా పలికిందని.. అభిమానుల ఫీడ్ బ్యాక్ ప్రకారం నెక్స్ట్ రాబోయే లియో పార్ట్ 2 విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని లోకేష్ తెలియపరిచారు.
లోకేష్ చెప్పిన మాటలను బట్టి అసంపూర్తి ఎండింగ్ తో ఫినిష్ అయిన లియో చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని అభిమానులు ఆశించారు. సీక్వెల్ సినిమా రావాలి అంటే మొదట వచ్చిన సినిమా భారీ సక్సెస్ అందుకోవాలి కదా. మరి అంతంత మాత్రం పర్ఫామెన్స్ తో సరిపెట్టుకున్న లియోచిత్రానికి సీక్వెల్ ఎలా తీస్తారు అనేది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. కానీ ఇంటర్వ్యూస్ లో లియో ఫ్లాష్ బ్యాక్ అబద్ధం అయ్యుండొచ్చు అని లోకేష్ చేసిన వ్యాఖ్యలతో ఈ చిత్రం రెండో భాగం పై అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా ఈ సినిమా ఎండింగ్ లో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఈ చిత్రాన్ని లింక్ చేయడంతో ఇక తప్పకుండా ఈ సినిమాకి తదుపరిభాగం ఉండాల్సిందే అని అర్థమయింది.
మరోపక్క ఇప్పుడు విజయ్ పూర్తిగా రాజకీయాలకు అంకితం అవుతాను అని ప్రకటించడంతోపాటు తన చివరి చిత్రం కోసం సరికొత్త దర్శకుల వేటలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను సెలెక్ట్ చేసుకునే మూవీ కూడా రాజకీయ అరంగేట్రానికి ఉపయోగపడేదిగా ఉంటుంది అని టాక్. అయితే లోకేష్ మాత్రం ఇప్పటికి కూడా లియో పార్ట్ 2 ఉంటుందనే గెట్టిగా నమ్ముతున్నాడట.అంతేకాదు సినిమాకి సంబంధించిన స్టోరీ సిద్ధం చేయడంతో పాటు విజయ్ అంగీకరిస్తే వెంటనే సినిమా తీసేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు.
ఎందుకంటే లోకేష్ లియో సెకండ్ పార్ట్ ని తన సినిమాటికి యూనివర్స్ లో గల కీలకమైన సన్నివేశాలతో రాసుకున్నారట. అందుకే
విజయ్ ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు సినిమా స్టార్ట్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని లోకేష్ చెప్తున్నాడు. కానీ నిజానికి ప్రస్తుతం విజయ్ ఉన్న పరిస్థితుల్లో లియో 2 చిత్రం కోసం సమయాన్ని కేటాయించే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఈ రెండో భాగం రాకపోతే ఇది నిజంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి పెద్ద ఎదురుదెబ్బే అనడంలో డౌట్ లేదు. మరి ఈ నేపథ్యంలో లోకేష్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Also Read: TDP JanaSena: పార్టీ వీడేవారికి చంద్రబాబు కీలక సూచన.. భవిష్యత్‌కు 'గ్యారంటీ' ప్రకటన
Also Read: New Party: ఆంధ్రప్రదేశ్‌లో మరో పార్టీ.. స్థాపించింది ఎవరు? ఎన్నికల్లో పోటీ చేస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Leo 2: లియో 2 లేనట్టేనా..లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి పెద్దదెబ్బ!