Leo Movie: ట్రైలర్‌ కూడా రిలీజ్ కాకముందే అక్కడ సంచనాలు సృష్టిస్తున్న విజయ్ 'లియో'..

Leo Movie: విజయ్ లియో మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే రికార్డు సృష్టించింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2023, 07:17 PM IST
Leo Movie: ట్రైలర్‌ కూడా రిలీజ్ కాకముందే అక్కడ సంచనాలు సృష్టిస్తున్న విజయ్ 'లియో'..

Leo Movie Trailer Release date: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నయా మూవీ లియో. లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈసినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఓవర్సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు 40 వేల టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. తాజాగా దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. ఇంకా థియేటర్ల సంఖ్య పెంచుతున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు ఈ స్థాయిలో టికెట్ల అమ్మకాలు జరగలేదని యూకేకు చెందిన నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సంఖ్య 50వేల  చేరే అవకాశం ఉందని నిర్మాణ సంస్థ తెలిపింది. 

తాజాగా ఈ మూవీ నుంచి త్రిష లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో త్రిష షాక్ అయినట్లు కనిపిస్తోంది.  అయితే ఈ మూవీ ట్రైలర్ ను కూడా ఈరోజు అంటే అక్టోబరు 05న రిలీజ్ చేసే అవకాశం ఉందని మేకర్స్ ప్రకటించారు. అయితే డేట్ అయితే చెప్పారు కానీ ట్రైలర్‌ టైం చెప్పకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మాస్టర్‌ తర్వాత విజయ్‌-లోకేశ్‌ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ సెన్షార్ ను పూర్తి చేసుకుంది.  ఈ మూవీకి యూ/ఏ(U/A) సర్టిఫికేట్‌ కూడా లభించింది. రెండు గంటల నలభై నిమిషాల రన్‌టైమ్‌ ఉన్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా  తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లు వెచ్చించడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: Devara Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా 'దేవర'...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News