Thalapathy Vijay: బాలకృష్ణ సినిమా కోసం కోలీవుడ్ లో ఫైట్.. విజయ్ లాస్ట్ సినిమా అదేనా!!

Bhagavanth Kesari: టాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో ఇళ‌య దళపతి విజయ్. యమ స్పీడుగా సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో ఇక సినిమాలు మానేసి పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తాడు అన్న ప్రచారం జరుగుతుంది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2024, 10:20 PM IST
Thalapathy Vijay: బాలకృష్ణ సినిమా కోసం కోలీవుడ్ లో ఫైట్.. విజయ్ లాస్ట్ సినిమా అదేనా!!

Thalapathy Vijay last movie: ఇళ‌య దళపతి విజయ్.. అంటే తమిళనాడులో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో సడన్ గా ‘తమిళ వెట్రి కళ‌గం’అనే పార్టీని అనౌన్స్ చేసి అందరినీ షాక్ చేశాడు. అయితే  2024 ఎన్నికలలో ఈ పార్టీ ద్వారా పార్టీ చేయబోవడం లేదని.. మరే పార్టీకి మద్దతు కూడా ఇవ్వట్లేదని అతను క్లియర్ గా చెప్పాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం జనరల్ ,ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కోసం అని ప్రకటించాడు విజయ్.

మనకు తెలిసి ఎందరో సినీ తారలు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అందులో చాలామంది రాజకీయాల్లోకి వచ్చాక కూడా నటన కంటిన్యూ చేశారు..చేస్తున్నారు ..ఎవరో కొందరు మాత్రం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ తన 69వ చిత్రం పూర్తి అయిన తర్వాత ఇక సినిమాలకు దూరంగా ఉంటానని విజయ్ చేసిన అనౌన్స్మెంట్ అభిమానులకు నిజంగానే బిగ్ షాక్. దళపతి 69 అతని చివరి సినిమా అని అనౌన్స్ కూడా చేశాడు. ఈ మూవీ తర్వాత తన పూర్తి దృష్టి రాజకీయాలపైనే పెడతానని విజయ్ ప్రకటించాడు.

విజయ్ రాజకీయ పార్టీ పెట్టడం అతని అభిమానులకు ఎంత సంతోషకరమైన విషయమో..అతను సినిమాల నుంచి రిటైర్ అవుతాను అనడం అంత బాధాకరంగా మారింది. ప్రస్తుతం అతను వెంకట్ ప్రభుత్వ చేస్తున్న గోట్ చిత్రం తరువాత మరి ఒక మూవీ చేసి సినీ ఇండస్ట్రీకి వీడ్కోలు చెబుతారట. విజయ్ దళపతి లాంటి హీరో చేయబోయే ఆ లాస్ట్ మూవీ ఏమిటా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే విజయ్ లాంటి హీరో సినిమాలు మానేస్తే ఆ ఎఫెక్ట్ తమిళ్ సినీ బిజినెస్ పై చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ విజయ్ ఫ్లాప్ సినిమాలు సైతం మంచి బిజినెస్ చేస్తాయి.

ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం దళపతి 69 ప్రాజెక్ట్ పై అందరూ క్యూరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ సినిమాకి సంబంధించి మరొక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది. విజయ్ లాస్ట్ సినిమా దళపతి 69 కాదని ఆ తరువాత మరో సినిమా అనగా విజయ్ లాస్ట్ మూవీ డి.వి.వి దానయ్య నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతుంది అని తెలుస్తోంది. ఇక విజయ్ ఎంచుకున్న సినిమా విషయానికి వస్తే .. బాలయ్య,  అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి మూవీ ను రీమేక్ చేయబోతున్నారు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ లైన్ విజయ్ కు బాగా నచ్చడంతో.. కోర్ పాయింట్ ని తీసుకొని దానిపై కొత్త కథను రెడీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రీమేక్ కోసం విజయ్ మాత్రమే కాదు తమిళ హీరో రజనీకాంత్ కూడా ట్రై చేస్తున్నారట. విజయ్ అలానే రజినీకాంత్ ఇద్దరు ఈ సినిమా రీమేక్ చేయడానికి తెగ ప్రయత్నిస్తున్నారని.. మరి చివరిగా ఈ సినిమా ఎవరి చెంతకి చేరుతుందో అని కోలీవుడ్ లో చర్చ సాగుతోంది.

మరి ఈ వార్త ఎంత వరకు వాస్తవం అనే విషయం తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: Sreemukhi: తలలో మల్లెపూలతో మత్తెక్కిస్తోన్న శ్రీముఖి.. ఇది మాములు డోస్ కాదండోయ్..

Also Read: Delhi High Court: భార్యలకు హెచ్చరిక.. మీ భర్త ఆదాయం ఎంత ఉన్నా సర్దుకోవాల్సిందే..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News