TFCC: లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారు మాకు ఫిర్యాదు చేయండి.. జానీ మాస్టర్ పై చర్యలుంటాయి.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ సంచలన ప్రకటన..

TFCC: తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వారిపై తప్పక చర్యలుంటాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ ఉదందంలో ఓ ప్రకటన చేసింది. అంతేకాదు 2018లోనే చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల పరిష్కారం కోసం ఓ ప్యానెల్ ను కలిగి ఉన్నట్టు తెలిపారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 17, 2024, 04:07 PM IST
TFCC:  లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వారు మాకు ఫిర్యాదు చేయండి.. జానీ మాస్టర్ పై చర్యలుంటాయి.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్  సంచలన ప్రకటన..

TFCC:  తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్యానెల్ వాళ్లు మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించినట్టు తెలిపారు. తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ మీద వచ్చిన ఈ ఫిర్యాదును  పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉందన్నారు. అంతేకాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్.. ఆయనపై ఆరోపణల నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ని ఆ పదవి నుంచి తప్పిస్టున్నట్టు కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది.

పైన తెలిపిన కేసు విషయమై కమిటీ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ లో  K.L. దామోదర్ ప్రసాద్, Hon. సెక్రటరీ & కన్వీనర్, ఝాన్సీ, చైర్‌పర్సన్, ఇంటర్నల్  సభ్యులు: తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది
ఎక్స్ టర్నల్ సభ్యులు: రామలక్ష్మి మేడపాటి, సామాజిక కార్యకర్త మరియు మీడియా నిపుణురాలు, కావ్య మండవ, న్యాయవాది,  POSH నిపుణురాలు

ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చని  కోరింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసుల బయట కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఎవరైనా ఫిర్యాదు చేయదలుచుకున్న వారు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య కంప్లైంట్ చేయవచ్చు.

అంతేకాదు కంప్లైంట్  నిమిత్తమై మమ్మల్ని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా క్రింది చిరునామాకు పంపవచ్చునని ఓ అడ్రస్ మెన్షన్ చేశారు.  
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డా. డి. రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 096. ఫిర్యాదులను నమోదు చేయడానికి ప్రత్యేక ఫోన్ నంబర్ వాట్సాప్ లేదా టెక్స్ట్   నెం. 9849972280, ఈమెయిల్ ఐడీ: complaints@telugufilmchamber.in
నోట్ : మీరు పంపబడిన వివరాలు రహస్యంగా ఉంచబడును. అంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కే.ఎల్. దామోదర్ ప్రసాద్.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News