Tenent Trailer Talk: తెలుగులో ఇప్పటి వరకు రానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న సత్యం రాజేష్ 'టెనెంట్' మూవీ.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

Tenent Trailer Talk: సత్యం రాజేష్.. కమెడియన్ కమ్ హీరో ఈ మధ్యకాలంలో లీడ్ రోల్లో అలరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 'పొలిమేర 2' మూవీతో అలరించిన ఈయన తాజాగా 'టెనెంట్' మూవీతో పలకరించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Last Updated : Apr 14, 2024, 12:30 PM IST
Tenent Trailer Talk: తెలుగులో ఇప్పటి వరకు రానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న సత్యం రాజేష్ 'టెనెంట్' మూవీ.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

Tenent Trailer Talk: 'పొలిమేర 2' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'టెనెంట్'. వై.యుగంధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీటైన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ వేడుకలో ప్రియదర్శి ఈ వేడుకలో ఛీఫ్‌ గెస్ట్‌గా అలరించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం అట్రాక్టివ్‌గా ఉంది.   
సత్యం రాజేష్ ప్రేమకథ, పెళ్లి సన్నివేశాలతో ఫీల్ గుడ్ గా మొదలైన ట్రైలర్ తర్వాత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ చాలా ఎక్సయిటింగ్ గా వుంది. పోలీస్ అధికారి ఎస్తర్ ..నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నువ్వే చంపేయడం ఏమిటి? అని ప్రశ్నించగా..‘రావణాసురుడు  సీతని చెరబడితే శిక్ష సీతకెందుపడింది?’ అని సత్యం రాజేష్ ఎదురు ప్రశ్నించడం ఈ సినిమా కథపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో సత్యం రాజేష్ తన యాక్టింగ్‌తో కట్టిపడేసాడు. ట్రైలర్ లో కనిపించిన మిగతా నటులు కూడా తమ పాత్రలలో ఒదిగిపోయారు. దర్శకుడు  వై. యుగంధర్ ఎంచుకున్న పాయిటింగ్ చాలా ఎమోషనల్, థ్రిల్లింగ్ గా వుంది. ట్రైలర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. మొత్తంగా ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఈ సదర్భంగా రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రియదర్శి మాట్లాడుతూ.. రాజేష్ అన్నకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజేష్ అన్నకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అద్దె కట్టకుండా టెనెంట్ గా ఉంటున్నాడు రాజేష్ అన్న(నవ్వుతూ).  నటుడిగా ఆయన ప్రయాణం, ట్రాన్స్ ఫర్మేషన్ స్ఫూర్తిదాయకమన్నారు. కంటెంట్ చాలా కొత్తగా వుంది. ఏప్రిల్ 19న సినిమా వస్తోంది. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.

 

హీరో సత్యం రాజేష్ మాట్లాడుతూ... దర్శకుడు యుగంధర్  'టెనెంట్' స్టోరీని తనకు ఎంత అద్భుతంగా నేరేట్ చేసారదో.. అంతే అద్భుతంగా తెరకెక్కించారు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు క్లైమాక్స్ లో కన్నీళ్లు వచ్చేశాయి. అంత అద్భుతంగా వచ్చింది సినిమా. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి సహకారం మరవలేనిది. నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అందరు నటీనటులు చాలా బాగా నటించారు. ఏప్రిల్ 19న సినిమా విడుదలౌతుంది. ప్రతీ ఒక్కరూ తప్పకుండా సినిమాని ప్రతి క్షణం ఎంజాయ్ చేయడం గ్యారంటీ.  

 

దర్శకుడు వై.యుగంధర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 19న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రతి ఒక్క మహిళకు కనెక్ట్ అయ్యే కథ ఇది. మహిళలు చూస్తే తప్పకుండా చూడాలని అబ్బాయిలకి చెబుతారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం మా నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. అలాగే మా సహా నిర్మాతలకు ధన్యవాదాలు.

నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..  'టెనెంట్'.. బలగం, కాంతార లాంటి సహజత్వంతో కూడుకున్న సినిమా. ఇందులో ఎమోషన్స్ ఎంతో అద్భుతంగా వుంటాయి. రాజేష్, ఎస్తర్ నటీనటులంతా చాలా అద్భుతంగా నటించారు. యుగంధర్ గారు నిర్మాతల దర్శకుడు. సినిమా  చాలా అద్భుతంగా వచ్చింది.  మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Also Read: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..

Also Read: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News