OTT movies this week: ఒటీటీలో సందడి చేయబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలివే!

OTT release this week in Telugu: ఫిబ్రవరి నెలలో పలు ఆసక్తికరమైన సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి,  ముఖ్యంగా తెలుగులో అందుబాటులోకి రానున్న ఐదు సినిమాల గురించి మీ కోసం

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 15, 2023, 02:43 PM IST
OTT movies this week: ఒటీటీలో సందడి చేయబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాలివే!

Telugu Movies OTT Streaming Dates: ఇప్పుడు తెలుగు సినిమాలంటే కేవలం తెలుగు వారు మాత్రమే కాదు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషా ప్రేమికులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలుగులో రూపొందిన సినిమాలు ఆయా భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ ఉండటంతో ఆయా సినిమాలను కొనుక్కున్న ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాయి. గతంలో ఇలా డబ్బింగ్ వర్షన్స్ కేవలం థియేటర్లలో విడుదల అయ్యేవి కానీ ఓటీటీ పుణ్యమా అని దాదాపు అన్ని భాషల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయి.

ఫిబ్రవరి నెలలో పలు ఆసక్తికరమైన సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి ముఖ్యంగా తెలుగులో అందుబాటులోకి రానున్న ఐదు సినిమాల గురించి చెప్పుకోవాలి. ఆ ఐదు సినిమాలు త్వరలోనే ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వీటిలో కొన్ని సినిమాలు ఇప్పటికే రిలీజ్ అవ్వగా మరికొన్ని సినిమాలు త్వరలో రిలీజ్ అవ్వబోతున్నాయి. 

హంట్:
అందులో మొదటి సినిమా విషయానికి వస్తే అది హంట్ సినిమా. సుధీర్ బాబు హీరోగా భారత్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఆహా యాప్, అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. మహేష్ సురపనేని తెరకెక్కించిన ఈ సినిమాలో సుధీర్ బాబు భరత్ శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్లుగా కనిపించారు.  

వేద:
అలాగే శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన వేద సినిమా కూడా అటు కన్నడ సహా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివ రాజకుమార్, లక్ష్మణ్, అదితి సాగర్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి జీ 5 యాప్ లో అందుబాటులో ఉంది. 

మాలికాపురం: 
గతంలో జనతా గ్యారేజ్, యశోద వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మాలికాపురం సినిమా కూడా తెలుగు ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో సందడి చేసింది, ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రంగం సిద్ధమవుతోంది. అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరిన ఒక ఎనిమిదేళ్ల పాప కథగా ఈ సినిమా తెరకెక్కించారు విష్ణు శశి శంకర్.  ఈ సినిమా 15వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉండనుంది

వీర సింహా రెడ్డి:
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా 23వ తేదీ ఫిబ్రవరి నెల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో సందడి చేయబోతోంది. కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా సందడి చేయడానికి రంగం సిద్ధమైంది. 

వాల్తేరు వీరయ్య:
 మరోపక్క వాల్తేరు వీరయ్య సినిమా కూడా ఈనెల 27వ తేదీ నుంచి సందడి చేయడానికి రంగం సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ఈ సినిమా సందడి చేయబోతోంది.

గాలోడు:

ఫిబ్రవరి17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో సుధీర్ గాలోడు స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Also Read: Bandla Ganesh Tweets: మీరు వండర్ ఫుల్, మీరే ఇండియా ఫ్యూచర్ కేసీఆర్.. బండ్లన్న ట్వీట్ల వర్షం!

Also Read: Hero Nani Clarity: నాని నోట బూతు పదం.. అసలు సంబంధమే లేదంటున్నాడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News