Allu Arjun: కాంగ్రెస్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ఆ స్థానం ఎంపీ సీట్ కన్ఫార్మ్..?..అంటూ వార్తలు..

Congress Party:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇక తాజాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి చెందిన కీలక వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 16, 2024, 12:06 PM IST
  • - కాంగ్రెస్ లోకి ఐకాన్ స్టార్ కుటుంబం..
    - మల్కాజ్ గిరి ఎంపీ సీటు నుంచి ఆఫర్..?
 Allu Arjun: కాంగ్రెస్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ఆ స్థానం ఎంపీ సీట్ కన్ఫార్మ్..?..అంటూ వార్తలు..

Congress Party-Icon Star AlluArjun: ఎంపీ ఎన్నికలకు ముందు రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు గెలుపు కోసం ప్రచారంను ముమ్మరం చేశాయి.  ఇదిలా ఉండగా.. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ లో వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ను తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేదిశగా ఆయన పాలన అందిస్తున్నారు.

Read More: Allu Arjun: అల్లు అర్జున్‌కు మ‌రో అరుదైన గౌర‌వం.. భార‌త దేశం తరుపున ఐకాన్ స్టార్ ఒకే ఒక్క‌డు..

ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు ఢిల్లీ పెద్దల ఆధ్వర్యంలో, సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.  తాజాగా, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్,భార్య స్నేహ రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కంచర్లకు ఇప్పటికే మల్కాజ్ గిరి ఎంపీ సీటు కన్ఫార్మ్ చేసినట్లు కూడా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Read More: Smelly Shoes: మీ బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుందా..?.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టేయోచ్చు..

బీఆర్ఎస్ లో ఉన్న కంచర్ల.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మామకోసం ప్రచారం చేస్తారా..?..అని కొందరు ఆయనను ప్రశ్నించగా.. నా గెలుపు కోసం అల్లుడు అల్లు అర్జున్  తప్పకుండా ప్రచారం చేస్తాడని చంద్రశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరీ దీనిపై అల్లు అర్జున్ ఎలా రెస్పాండ్ అవుతారో మాత్రం తెలియాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News