Tees Maar Khan Producer : స్పీడు మీదున్న తీస్ మార్ ఖాన్ నిర్మాత.. బర్త్ డే స్పెషల్‌గా మరిన్ని ప్రాజెక్ట్‌లపై ప్రకటన

HBD Nagam Tirupathi Reddy నిర్మాత నాగం తిరుపతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్ ప్రాజెక్టుల మీద కామెంట్ చేశాడు. వచ్చే ఏడాదిలో రెండు పెద్ద సినిమాలు చేయబోతోన్నట్టు ప్రకటించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 04:38 PM IST
  • తీస్ మార్ ఖాన్ నిర్మాత బర్త్ డే
  • బర్త్ డేను సెలెబ్రేట్ చేసిన టీం
  • కొత్త సినిమాలపై నాగం తిరుపతిరెడ్డి ప్రకటన
Tees Maar Khan Producer : స్పీడు మీదున్న తీస్ మార్ ఖాన్ నిర్మాత.. బర్త్ డే స్పెషల్‌గా మరిన్ని ప్రాజెక్ట్‌లపై ప్రకటన

Tees Maar Khan Producer రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఈ మధ్య సినిమా రంగంలోకి చాలా మంది వస్తున్నారు. రియల్ ఎస్టేట్‌ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అందులో కొంత మంది మాత్రమే నిలదొక్కుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి నాగం తిరుపతి రెడ్డి కూడా చేరాడు. తీస్ మార్ ఖాన్ వంటి మంచి చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి తీస్ మార్ ఖాన్ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే .

నేడు (డిసెంబర్ 25) నిర్మాత నాగం తిరుపతి రెడ్డి పుట్టిన రోజు. విజన్ సినిమాస్ కార్యాలయంలో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది యూనిట్. ఈక్రమంలో ఆయన కొన్ని విషయాలను బయటపెట్టేశాడు. తమ బ్యానర్‌లో ఇది వరకు వచ్చిన నాలుగు చిత్రాలకు మీడియా నుంచి మంచి సహాకారం అందిందని, ప్రేక్షకులు సైతం మా చిత్రాలను ఆదరించారని చెప్పుకొచ్చాడు. 

వచ్చే ఏడాదిలో రెండు సినిమాలు రాబోతున్నాయని, అవి ప్రముఖ హీరోలతో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నామని అసలు విషయాన్ని చెప్పేశాడు. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తామని అన్నాడు. తీస్ మార్ ఖాన్ మాస్ ఆడియెన్స్‌ను మెప్పించడం, కమర్షియల్‌గా విజయం సాధించడం నిర్మాతలో మరింత ఉత్సాహం నింపినట్టు అయింది. ఇప్పుడు ఆయన అన్ని రకాల జానర్లలో భారీ సినిమాలను నిర్మిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Also Read : Samantha Ruth Prabhu : వారందరికీ నేను చెప్పదల్చుకున్నది ఇదే.. సమంత పోస్ట్ వైరల్

Also Read : చికెన్ బిర్యానీ తిని వెంటనే చనిపోయారు.. అసలు విషయం బయటపెట్టిన రవిబాబు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News