Taraka Ratna Wife Emotional: బాలయ్య రాయిలా అడ్డున్నాడు..తారకరత్న ఎమోషనల్ మెసేజ్ వైరల్!

Taraka Ratna Wife Emotional Post: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. బాలకృష్ణ తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలో నందమూరి తారకరత్నను చేర్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు.   

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 13, 2023, 11:18 PM IST
Taraka Ratna Wife Emotional: బాలయ్య రాయిలా అడ్డున్నాడు..తారకరత్న ఎమోషనల్ మెసేజ్ వైరల్!

Taraka Ratna Wife Emotional Post on Balakrishna: సినీ హీరో నందమూరి కుటుంబానికి చెందిన తారకరత్న గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆయనకు సంబంధించిన దశ దినకర్మ కూడా పూర్తయింది. ఇక తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. బాలకృష్ణ తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలో నందమూరి తారకరత్నను చేర్చిన ఒక మార్ఫింగ్ ఫోటోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

బాలకృష్ణ గురించి ఎమోషనల్‌గా ఇలా రాశారు. ''ఎవరినైతే మేము కుటుంబం అని చెప్పగలమో... ఎవరైతే మాకు ఇబ్బంది కలిగినప్పుడు... సంతోషం కలిగినప్పుడు... మా వెంటే ఉంటూ... మాకు అండగా నిలబడి మమ్మల్ని కాపాడుతున్నారో... ఆయనే బాలకృష్ణ. చివరి వరకు తారకరత్నకు ఆయనే అండగా ఉన్నారు. మిమ్మల్ని హాస్పిటల్‌కి తండ్రిలా తీసుకెళ్లడం దగ్గర నుంచి... మీరు బెడ్ మీద ఉన్నప్పుడు మీ పక్కనే కూర్చోవడం... మీ కోసం అమ్మలాగా లాలి పాడటం... ఎవరూ లేని సమయంలో సిల్లీ జోక్స్ వేసి... మీరు నవ్వుతారేమో.. రియాక్ట్ అవుతారేమో అని చూడటం... ఆయన అవన్నీ చేశారు.

ఓబు నువ్వు ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండేది.  నిన్ను చాలా మిస్ అవుతున్నాము అంటూ ఈ ఫోటో ఎవరు మార్ఫింగ్ చేశారో కానీ ఒరిజినల్‌లాగానే ఉంది. ఇది ఒక అద్భుతమైన ఎడిటింగ్ ఫోటో. థాంక్యూ సో మచ్. నందమూరి బాలకృష్ణ... జై బాలయ్య.. తారకరత్న అంటూ ఆమె ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.

ఇక నందమూరి బాలకృష్ణ అన్ని విషయాల్లోనూ తారకరత్నకు ఆయన భార్య అలేఖ్య రెడ్డికి అండగా నిలుస్తూ వచ్చారు. కుటుంబం అంతా వారిని దూరం పెట్టినా... బాలకృష్ణ మాత్రం వారికి అండగా నిలుస్తూ ఏం కావాలంటే అది ఇస్తూ కన్న చూసుకున్నారు. అలేఖ్య రెడ్డి కుటుంబం తరఫున విజయ్ సాయి రెడ్డి ఈ విషయాలన్నీ చూసుకుంటూ వచ్చారు. తారకరత్న మృతితో అలేఖ్య రెడ్డి చాలా కృంగిపోతున్నారు. ఆ విషయం ఈ పోస్ట్ చూస్తేనే అర్థమవుతుంది.

Also Read: Naatu Naatu Song: నాటు నాటు కోసం 20 ట్యూన్స్..19 నెలలు.. ఈ విషయాలు మీకు తెలుసా?:

Also Read: Hero Raviteja Harrasment: హీరోయిన్లు, ఐటెం గాళ్స్ మీద రవితేజ అరాచకం.. ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News