Taraka Ratna Health Update: తారకరత్న హెల్త్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడెలా ఉందంటే?

Taraka Ratna Health Update: నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు అమిగోస్ సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఈమేరకు కామెంట్లు చేశారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 9, 2023, 06:31 PM IST
Taraka Ratna Health Update: తారకరత్న హెల్త్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడెలా ఉందంటే?

Taraka Ratna Health Update: నందమూరి కుటుంబానికి చెందిన హీరో తారకరత్న కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ పాదయాత్ర యువగళం ప్రారంభిస్తున్న రోజు కుప్పంలో పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే అదే రోజు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుప్పం పాదయాత్రలోనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లినా, హాస్పిటల్ కి తీసుకు వెళ్లడానికి సుమారు 45 నిమిషాలు పట్టింది. ఆ 45 నిమిషాల పాటు ఆయన గుండె ఆగిపోయింది అని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో రక్త ప్రసరణ ఆగిపోవడంతో ఆయన ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని చెబుతున్నారు.

వాస్తవానికి ఆయన ప్రాణానికే ప్రమాదం కానీ ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియదు ఆయన గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించిందని అప్పటినుంచి ఆయనను మామూలు మనిషిని చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆయన నారాయణ హృదయాలయ అనే హాస్పిటల్లో గుండెకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన బ్రెయిన్ సరిగా పనిచేయడం లేదని పైభాగం కొంతమేర దెబ్బతిందని గతంలో వివరాలు బయటకు వచ్చాయి. ఆయనను విదేశాలకు వైద్యం నిమిత్తం తీసుకెళ్లే అవకాశం ఉందని ప్రచారం కూడా జరిగింది.

అయితే తాజాగా ఇదే విషయం మీద నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. తన సోదరుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రతిదానికి మెరుగ్గానే ఉందని, అయితే పూర్తి వివరాలు మాత్రం తాను కాదు డాక్టర్లు మాత్రమే అందించగలరు అని చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నటించిన అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన అంటే రేపు పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కళ్యాణ్ రామ్. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ప్రశ్నించగా ఈ మేరకు ఆయన స్పందించారు.

తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుందని అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి ఎలా ఉంది అనేది డాక్టర్లు మాత్రమే చెప్పగలరని అన్నారు. తాము మాత్రం ఆయన తిరిగి మామూలు మనిషి అవ్వాలని మళ్లీ మాలో ఒకరిగా కలిసి నడవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ అమిగోస్ సినిమాను రాజేంద్రనాథ్ రెడ్డి తెరకెక్కించగా కన్నడ భామ ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ 3 పాత్రలలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ముగ్గురు ఒక్కరేనా లేక వేరువేరు పాత్రలా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా విడుదలకు మరిది గంటల మాత్రమే సమయం ఉండడంతో సినిమా ప్రమోషన్స్ సినిమా యూనిట్ పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది.
Also Read: Ram Charan New Party: జనసేనకు షాక్.. కొత్త పార్టీ నుంచి పోటీ చేస్తున్న రామ్ చరణ్?

Also Read: Thegimpu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన అజిత్ తెగింపు.. ఎందులో చూడాలో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News