Nayanthara Surrogacy Report : నయనతార సరోగసి వివాదం.. హడావిడి చేసిన ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఇదే

Nayanthara Surrogacy Report సరోగసి ద్వారా నయనతార బిడ్డలను కనడం చట్టరిత్యా నేరమని, సరోగసి ఇండియాలో బ్యాన్ చేశారనే కాంట్రవర్సీ గత కొన్ని రోజులుగా నడుస్తున్న సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2022, 09:46 AM IST
  • నయనతార సరోగసి విధానం
  • తమిళనాడు ప్రభుత్వ రిపోర్ట్ ఇదే
  • చట్టం అమల్లోకి రాక ముందే నిర్ణయం
Nayanthara Surrogacy Report : నయనతార సరోగసి వివాదం.. హడావిడి చేసిన ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఇదే

Nayanthara Surrogacy Report : నయనతార విఘ్నేశ్ శివన్ జోడికి కవలలు పుట్టిన సంగతి తెలిసిందే. కవలలు పుట్టారంటూ విఘ్నేశ్ శివన్ షేర్ చేసిన క్షణం అందరూ షాక్ అయ్యారు. ఇదంతా ఎప్పుడు జరిగిందని అంతా ఆశ్చర్యపోయారు. అయితే సరోగసి ద్వారా పిల్లలు కన్నారని వెంటనే బయటకు వచ్చింది. దీంతో వివాదం వెంటనే రాజుకుంది. సరోగసి ఇండియాలో నిషేదం అయినప్పుడు మీరు ఎలా సరోగసి ద్వారి పిల్లల్ని కన్నారంటూ సోషల్ మీడియాలో అందరూ ప్రశ్నించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

నయనతార సరోగసి వివాదం మీద తమిళనాడు ప్రభుత్వం వేసిన కమిటి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించలేదని, అన్ని సక్రమంగానే జరిగాయని తమిళనాడు ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. సరోగసి ఇండియాలో నిషేదం అని తెలుసు కదా? ఇప్పుడు ఇది ఎలా సాధ్యమైంది? అంటూ నయనతార సరోగసి మీద సోషల్ మీడియా నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో తమిళ నాడు ప్రభుత్వం వెంటనే ఓ కమిటీ వేసింది. ఇలా నివేదిక తెప్పించుకుంది. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తమిళ నాడు ప్రభుత్వం ఈ విషయాన్ని తేల్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సరోగసి విధానంలో చట్టవ్యతిరేకమైన పనులేమైనా ఉన్నాయా? అని గుర్తించేందుకు ఈ కమిటీని నియమించింది. తప్పంతా కూడా హాస్పిటల్‌దే అని, సరోగసి చేసిన తరువాత జరిగిన ప్రచారంలో హాస్పిటల్ తప్పే ఉందని కమిటీ తేల్చింది. సరోగసి చేసిన డాక్టర్‌ను విచారణ చేస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చాయట. 

నయన్ ఫ్యామిలీ డాక్టర్ ఈ సరోగసి గురించి 2020లోనే రికమండ్ చేశాడట. అయితే సరోగసికి సిద్దపడ్డ మహిళ ఈ అగ్రిమెంట్‌లోకి 2021 నవంబర్‌లో వచ్చిందట. ఈ ఏడాది మార్చిలోనే పిండాన్ని ఆమెలోకి ప్రవేశపెట్టారట. అక్టోబర్‌లో కవలలు పుట్టారు. అయితే ఇండియాలో సరోగసి చట్టాన్ని 2021లో చేస్తే జనవరి 2022 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే నయనతార ఒప్పందం చేసుకున్నది దాని కంటే ముందే. కాబట్టి అది చట్టబద్దమేనని తమిళనాడు ప్రభుత్వం కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.

Also Read : RGV Meets CM YS Jagan : వైఎస్ జగన్‌తో ఆర్జీవీ భేటీ.. పవన్ కళ్యాణ్ పరువుతీసేందుకే కుట్ర?

Also Read : Jr NTR - Chiranjeevi : నాడు అలా నేడు ఇలా.. చిరంజీవిపై యంగ్ టైగర్.. ఎన్టీఆర్‌లో ఎంత మార్పు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News