Vijay: ‘విజయ్‌’ మక్కల్‌ ఇయక్కం రద్దు..ఆందోళనలో విజయ్ ఫ్యాన్స్

Vijay:  తమిళ స్టార్ హీరో విజయ్‌కి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పార్టీని రద్దు చేసినట్టు ప్రకటించారు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2021, 02:31 PM IST
Vijay: ‘విజయ్‌’ మక్కల్‌ ఇయక్కం రద్దు..ఆందోళనలో విజయ్ ఫ్యాన్స్

Vijay:  ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పార్టీని రద్దు చేసినట్టు దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌(SA Chandrasekhar)  ప్రకటించారు. ఈ మేరకు చెన్నై హక్కుల కోర్టులో సమాధాన పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌ తదుపరి విచారణ అక్టోబరు 29కి వాయిదా పడింది. ప్రముఖ నటుడు విజయ్‌(Vijay) రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్‌ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ 2020లో ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’(vijay makkal iyakkam) పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు.

Also read: Kondapolam Trailer: "మీ ఎనకాల గొర్రెలు కాదు కాదా.. వాటి బొచ్చుకుడా రాదు"

తన పేరు ఉపయోగించుకుని కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించాలని విజయ్‌ ఇటీవల చెన్నై హక్కుల కోర్టు(Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ జరిగింది. ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ను రద్దు చేసినట్టు చంద్రశేఖర్‌ సమాధాన పిటిషన్‌ దాఖలు చేశారు. అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ విజయ్‌(Vijay) తన తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని విజయ్‌ గతంలో ప్రకటించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

pple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News