Bigg Boss: సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలి.. తమన్నా సింహాద్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Tamanna Simhadri on CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 01:37 PM IST
  • సీపీఐ నారాయణపై తమన్నా సింహాద్రి వివాదాస్పద వ్యాఖ్యలు
  • నారాయణను చెప్పుతో కొట్టాలన్న తమన్నా
  • బిగ్‌బాస్ షోపై నారాయణ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన తమన్నా
Bigg Boss: సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలి.. తమన్నా సింహాద్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Tamanna Simhadri on CPI Narayana: బిగ్‌బాస్ రియాలిటీ షోపై సీపీఐ నేత నారాయణ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నారాయణ వ్యాఖ్యలను ఖండిస్తూ బిగ్‌బాస్ కంటెస్టెంట్, ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలన్నారు. ఒకవేళ బిగ్‌బాస్ షో నచ్చకపోతే చానెల్ మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ షో కారణంగానే తమకు గుర్తింపు దక్కుతోందని.. తద్వారా ఉపాధి కలుగుతోందని చెప్పారు.

బిగ్‌బాస్ షోపై సీపీఐ నారాయణ గతంలోనూ పలుమార్లు వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ షోని నిషేధించాలని ఆయన చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ షో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఆ షోపై విరుచుకుపడ్డారు. బిగ్‌బాస్ షో ఒక బ్రోతల్ హౌజ్ అని.. అది రెడ్ లైట్ ఏరియా కన్నా దారుణమని విమర్శించారు. అన్నమయ్య లాంటి భక్తి చిత్రాల్లో నటించిన నాగార్జున.. ఇలాంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం అవమానకరమన్నారు. ఈ షో ద్వారా ప్రజలకు ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు.

బిగ్‌బాస్ షోకి వ్యతిరేకంగా సీపీఐ నారాయణ డిజిటల్ క్యాంపెయిన్‌ని మొదలుపెట్టారు. మహిళలను అవమానపరిచే ఈ షోని నిషేధించాలని నారాయణ డిమాండ్ చేస్తున్నారు. నిజానికి గతంలోనూ బిగ్‌బాస్‌పై సీపీఐ నారాయణ విమర్శలు చేసినప్పటికీ.. ఈ స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. ఇలాంటి దిగజారుడు షోలు చేయవద్దంటూ గతంలో నాగార్జునను సున్నితంగా హెచ్చరించే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి మాత్రం నారాయణ బిగ్‌బాస్‌పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడటం హాట్ టాపిక్‌గా మారింది. 

Also Read: Hyderabad Blast: హైదరాబాద్‌లో బాంబు బ్లాస్ట్.. ఒకరు మృతి!

Also Read: Petrol Price Hiked: బాప్‌రే.. లీటర్ పెట్రోల్ ధర @ రూ. 204.. ఎక్కడో తెలుసా..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News