Mision Impossible: తాప్సీ ప్రధాన పాత్రలో..మరో యాక్షన్ థ్రిల్లర్ మిషన్ ఇంపాజిబుల్

Mision Impossible: ప్రముఖ బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మరో కొత్త యాక్షన్ థ్రిల్లర్‌తో ముందుకొస్తోంది. వినూత్న కథాంశంతో తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ ధియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2022, 07:22 AM IST
Mision Impossible: తాప్సీ ప్రధాన పాత్రలో..మరో యాక్షన్ థ్రిల్లర్ మిషన్ ఇంపాజిబుల్

Mision Impossible: ప్రముఖ బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మరో కొత్త యాక్షన్ థ్రిల్లర్‌తో ముందుకొస్తోంది. వినూత్న కథాంశంతో తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్ ధియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. 

ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైనర్ మరో భారీ భడ్జెట్ సినిమా నిర్మిస్తోంది. తాప్సీ పన్ను ప్రధాన నాయికగా మిషన్ ఇంపాజిబుల్ సినిమా తెరకెక్కుతోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడైన స్వరూప్ ఆర్ఎస్‌జే ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ప్లాట్‌లైన్‌లోని విషయాన్ని ఈ ట్రైలర్ చెబుతుంది. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడి అరెస్టు, బెయిల్ రావడం వంటి అంశాన్ని చెబుతూ..ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా తాప్సీ డైలాగ్ ఉంటుంది ట్రైలర్‌లో. 

Taapsi pannju in mission impossible

మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో తక్కువ సమయంలో ధనవంతుడిగా మారిన ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు ముగ్గురు పిల్లల సహాయం తీసుకుంటారు. తాప్సీ పిల్లల సహాయంతో ఈ మిషన్ ఎలా పూర్తి చేస్తుందనేది కథలో కీలకమైన అంశం. నిజంగా జరిగిన ఘటన ఆధారంగా స్వరూప్ అద్భుత రచన, టేకింగ్‌తో పూర్తి కమర్షియల్‌గా సినిమా రూపొందింది. తాప్సీ నటిస్తున్న మరో యాక్షన్, థ్రిల్లింగ్ సినిమా ఇది. నిజానికి ఈ సినిమాలో తాప్సీనే ఓ ఎస్సెట్. ఇందులో నటించిన పిల్లలు కూడా చాలా చురుగ్గా కన్పిస్తారు. 

మార్క్ కె రాబిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ , దీపక్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయి. నిరంజన్ రెడ్డి , అణ్వేష్ రెడ్డి నిర్మాతలుగా, ఎన్ఎం పాషా సహ నిర్మాతగా ఉన్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 1న మిషన్ ఇంపాజిబుల్ సినిమా విడుదల కానుంది. 

Also read: Item Songs: ఐటమ్ సాంగ్స్ వర్సెస్ స్టార్ హీరోయిన్స్..ఇక నుంచి ఐటమ్ సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్సే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News