Namrata: సినిమాల్లో రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, ఎప్పుడంటే

Namrata: మాజీ మిస్ ఆసియా పసిఫిక్, మహేశ్ బాబు భార్య, మాజీ బాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్. గత కొద్దికాలంగా నమ్రతా సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై నమ్రతా స్పందించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 8, 2022, 08:51 PM IST
Namrata: సినిమాల్లో రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, ఎప్పుడంటే

Namrata: మాజీ మిస్ ఆసియా పసిఫిక్, మహేశ్ బాబు భార్య, మాజీ బాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్. గత కొద్దికాలంగా నమ్రతా సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై నమ్రతా స్పందించింది. 

సూపర్‌స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ గురించి అందరికీ తెలుసు. గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే..మహేశ్ వ్యాపార, సినిమా వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకుంటోంది. 1993లో మిస్ ఇండియా, మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్స్ గెల్చుకున్న తరువాత...హిందీ సినిమాల్లో అడుగెట్టింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నమ్రతా శిరోద్కర్..మహేశ్ బాబు ప్రేమలో పడి..పెళ్లి చేసుకుంది. టాలీవుడ్‌లో బెస్ట్ లవ్ కపుల్‌గా ఈ జంటే కన్పిస్తుంది. మహేశ్ భార్యగా అడుగెట్టిన తరువాత మళ్లీ సినిమాలవైపు చూడలేదు. మహేశ్ బాబు సినిమా డేట్స్, సినిమా ప్రచార వ్యవహారం, మహేశ్ నిర్మించిన జీఎమ్బీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ, ఇతర వ్యాపారాల్ని స్వయంగా చూసుకుంటోంది. 

గత కొద్దికాలంగా నమ్రతా శిరోద్కర్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారం ఎక్కువైంది. ఆమె ఎక్కడ కన్పించినా ఇదే ప్రశ్న సంధిస్తున్నారు. రీ ఎంట్రీ ఎప్పుడంటూ. ఈ వార్తలపై, పుకార్లపై ఆమె క్లారిటీ ఇచ్చింది. కుటుంబ బాధ్యతలతో సంతోషంగా ఉన్నానని...రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది నమ్రతా శిరోద్కర్. నా అభిమానులకు నన్ను తెరపై చూడాలనుంది కానీ..నేను వారి కోరికను మన్నించలేకపోతున్నా...సినిమాలపై ఇక ముందు కూడా దృష్టి పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేసేసింది. 

Also read: Poonam Bajwa Pics: ఆహా అనిపిస్తున్న పూనమ్ బజ్వా అందాలు.. అందరి చూపు అక్కడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News