BiggBoss 5 Title Winner: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. టాప్ 5లో టైటిల్ విన్నర్ ఎవరనే విషయంపై చర్చ ప్రారంభమైంది. ఇదే సమయంలో సన్నీ వర్సెస్ శ్రీరామచంద్రలో ఎవరికి ప్రేక్షకుల మద్దతుందనేది ఆసక్తిగా మారింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5(BiggBoss Telugu Season5)గ్రాండ్ ఫినాలేకు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలింది. టాప్ 5 కంటెస్టెంట్లుగా ఉన్న శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, షణ్ముఖ్, మానస్‌లలో ఒకరు విజేతగా నిలవనున్నారు. ప్రస్తుతం ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవడంతో వివిధ కంటెస్టెంట్ల అభిమానులు హల్‌చల్ చేస్తున్నారు. బిగ్‌బాస్ టైటిల్ విన్నర్స్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది. అందరికంటే ఎక్కువగా సన్నీ పేరు బలంగా విన్పిస్తోంది. సన్నీకు ప్రేక్షకుల్నించి మద్దతు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
సన్నీపై అభిమానం పెరగడానికి కారణం
సన్నీ ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి.. పేజ్ 3 జర్నలిస్ట్‌గా ఆఫ్ స్క్రీన్‌లో ఉంటూ సెలెబ్రిటీల్ని ఇంటర్వ్యూలు చేసేవాడు. ఖమ్మం జిల్లాకు చెందిన సన్నీ బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని వ్యక్తే. అంటే కేవలం ఓ సామాన్య వ్యక్తిగా బిగ్‌బాస్ హౌస్‌లో(BiggBoss Houes)ఎంట్రీ ఇచ్చి..టాప్ 5 వరకూ దూసుకెళ్లాడు. నిజ జీవితంలో కూడా కష్టపడుతూ ఎదిగిన వ్యక్తి. అటు బిగ్‌బాస్(BigBoss) హౌస్‌లో కూడా ఒక్కడిగా ఎంట్రీ ఇచ్చి..మానస్, కాజల్ రూపంలో మంచి స్నేహితుల్ని సంపాదించుకుని చివరి వరకూ నిలుపుకోగలిగాడు. జర్నలిస్టుగా ప్రారంభమైన ప్రయాణంలో బిగ్‌బాస్ రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నించాడు. స్వతహాగా తెలివైనవాడు కావడంతో ఎవరెన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నా...నెగ్గుకు రాగలిగాడు. విజేతగా నిలవాలనే తపనతో అనుక్షణం ప్రయత్నిస్తూ..స్నేహానికి విలువిస్తూ టాప్ 5 వరకూ వచ్చేశాడు. మధ్యలో అతని కేరక్టర్ దెబ్బ తీసేందుకు సిరి ప్రయత్నించినా..వీడియోలో సన్నీ తప్పేమీ లేదని తేలింది. ఎక్కడా ఎవర్నీ నొప్పించకుండా తన ఆట తాను ఆడుతూ అందర్నీ ఆకట్టుకోగలుగుతున్నాడు.
మిగిలినవారికి సన్నీకు తేడా ఇదే
సన్నీ తప్పించి టాప్ 5లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్లలో శ్రీరామచంద్ర సుపరిచితమైన సింగర్. ఇండియన్ ఐడల్ విన్నర్‌గా బయటి ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి. అంటే ప్రేక్షకుల్లో జీరో స్థాయి నుంచి రాలేదు. సన్నీ మాత్రం ప్రేక్షకులపరంగా జీరో లెవల్ నుంచి సెకండ్ ఫైనలిస్ట్ స్థాయికి ఎదిగాడు. అటు షణ్ముఖ్(Shanmukh), సిరిలు(Siri)యూట్యూబర్లుగా, సినిమా నటులుగా బయటి ప్రపంచానికి తెలిసిన వ్యక్తులు. ఈ ఇద్దరు హౌస్‌లో వచ్చేటప్పటికే ప్రేక్షకుల్లో కాస్తో కూస్తో ఇమేజ్ ఉన్నవారు. ఇక సన్నీ బెస్ట్ ఫ్రెండ్ మానస్ కూడా బయటి ప్రపంచానికి సుపరిచితుడే. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా , నటుడిగా ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ ప్రత్యేకత నిలుపుకున్న వ్యక్తి. మంచి డ్యాన్సర్. సో మానస్(Maanas)కూడా జీరో లెవల్ నుంచి లేని వ్యక్తి. సన్నీ ఒక్కడే జీరో లెవల్ నుంచి ఎదిగి...టాప్ వరకూ చేరుకున్నాడంటే అది పూర్తిగా అతడి సామర్ధ్యమే.
ఇక బిగ్‌బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్‌గా ఎంపికైన శ్రీరామచంద్ర(Sriramachandra)బయట అంత ఫాలోయింగ్ ఉన్నా ఓటింగ్ ఆశించినస్థాయిలో రాబట్టుకోలేకపోతున్నట్టే చెప్పాలి. ఎందుకంటే శ్రీరామచంద్ర తప్పించి మిగిలిన కంటెస్టెంట్లు ఓటింగ్ ఆధారంగా టాప్ 5లో నిలిచారు. శ్రీరామచంద్ర మాత్రం కేవలం టికెట్ టు ఫినాలే పోటీ ఆధారంగా టాప్ 1 ఫైనలిస్ట్‌గా నిలిచాడు. అది కూడా అతడి సహచరులు సన్నీ, షణ్ముఖ్‌లు(Shanmukh) అతని తరపున ఆడటం ద్వారా మాత్రమే. చివరి పోటీ మాత్రమే శ్రీరామచంద్ర స్వయంగా ఆడాడు. ఈ ప్రకారం చూస్తే శ్రీరామచంద్ర కంటే ఇతరులకే ప్రేక్షకుల ఓటింగ్ ఉన్నట్టు అర్ధం చేసుకోవాలి. అటు ప్రేక్షకులు కూడా ఈ విశ్లేషణ ఆధారంగానే ఓట్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సన్నీ(Sunny) జీరో స్థాయి నుంచి హౌస్‌లో ప్రవేశించి..టాప్ 2 ఫైనలిస్ట వరకూ వెళ్లాడు. కచ్చితంగా కప్ సాధిస్తాననే విశ్వాసంతో ఉన్నాడు.
Also read: BiggBoss 5 Telugu Grand Finale:బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలే అతిధులు ఎవరో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి