సునీల్ కొత్త సినిమా ట్రైలర్ విడుదల

ఒకప్పుడు హాస్యనటుడిగా ఒక్క వెలుగు వెలిగి.. ఆ తర్వాత అందాల రాముడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు లాంటి చిత్రాలతో మంచి కామెడీ హీరోగా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న హీరో సునీల్. ఇప్పుడు ఆయన ‘టూ కంట్రీస్‌’ అనే మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు

Last Updated : Dec 10, 2017, 04:53 PM IST
సునీల్ కొత్త సినిమా ట్రైలర్ విడుదల

ఒకప్పుడు హాస్యనటుడిగా ఒక్క వెలుగు వెలిగి.. ఆ తర్వాత అందాల రాముడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు లాంటి చిత్రాలతో మంచి కామెడీ హీరోగా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న హీరో సునీల్. ఇప్పుడు ఆయన ‘టూ కంట్రీస్‌’ అనే మరో చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. సునీల్ సరసన మనీశ్ రాజ్, సంజన గల్రానీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎన్‌.శంకర్‌ దర్శకత్వం వహించనున్నారు. శ్రీధర్ ఈ చిత్రానికి సంభాషణలు అందించగా, గోపీ సుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైంది.

ఈ ట్రైలర్‌లో విలన్‌ హీరోతో మాట్లాడుతూ.. ‘తెల్లబట్టలు వేసుకున్న ప్రతీవాడూ ఫ్యాక్షనిస్ట్‌ కాలేడు’ అంటే అందుకు సునీల్‌.. ‘నల్లబట్టలు వేసుకున్న ప్రతీవాడూ అయ్యప్పస్వామి భక్తుడు కాలేడు’ అని చెప్పిన డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం గమనార్హం. 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ, జబర్దస్త్ అప్పారావు, రాజారవీంద్ర, షాయాజీ షిండే, శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

 <

>

Trending News